@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రాంతీయత నుంచి.. జాతీయస్థాయి దాకా...


వేవ్స్ 2025లో భారత అత్యుత్తమ క్రియేటర్లను వెలుగులోకి తేనున్న డబ్ల్యూఏపీ!

 Posted On: 21 APR 2025 4:08PM |   Location: PIB Hyderabad

నెలల తరబడి కొనసాగిన ప్రాంతీయ స్థాయి పోటీలు.. వేలాది ఎంట్రీల తరువాత దేశంలోని 11 నగరాలకు చెందిన ఫైనలిస్టులు జాతీయ స్థాయి తుదిపోరు “వేవ్స్ యానిమే అండ్ మాగ్నా కాంటెస్ట్ (వామ్)”లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. దేశంలోనే మొట్టమొదటి మీడియా-వినోద సమిట్ వేవ్స్ 2025లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మే 1–4 వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుంది.

మీడియా-వినోద సమిట్ వేవ్స్ 2025లో భాగంగా భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో మీడియా-ఎంటర్టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎమ్ఈఏఐ) ఈ వామ్!ను నిర్వహిస్తోంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీలు భాగంగా గల ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం కోసం వేవ్స్ దేశంలోనే అతిపెద్ద వేదిక. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ (సీఐసీ) వేవ్స్‌లో అత్యంత కీలకమైనది. 1100 మంది అంతర్జాతీయ పార్టిసిపెంట్స్ సహా సుమారు 1 లక్షకు పైగా రిజిస్ట్రేషన్‌లతో సీఐసీ మొదటి సెషన్ చరిత్ర సృష్టించింది.

సీఐసీలోని అత్యుత్తమ విభాగాల్లో వామ్! ఒకటి. గత దశాబ్ద కాలంలో, దేశంలో యానిమే, మాంగా వేగంగా అభివృద్ధి చెందాయి. ఒక ప్రత్యేక ఆసక్తిగా మొదలైన ఈ విభాగం ప్రస్తుతం ఒక ప్రధాన సాంస్కృతిక రంగంగా మారింది. 180 మిలియన్ల మంది యానిమే అభిమానులతో, నేడు చైనా తర్వాత రెండో అతిపెద్ద యానిమే మార్కెట్‌గా భారత్ నిలిచింది. ఈ వృద్ధి అభిమానుల్లో మాత్రమే కాకుండా గణాంకాల్లోనూ ఉంది. 2023లో, భారతీయ యానిమే మార్కెట్ విలువ 1,642.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2032 నాటికి ఇది 5,036 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

 భారత క్రియేటర్స్ అసలైన ఐపీలను (మేధో సంపత్తి) అభివృద్ధి చేయడానికి, అందించడానికి నిర్మాణాత్మక అవకాశాలను కల్పిస్తూ వామ్! నానాటికీ వృద్ధి చెందుతున్న ఈ సృజనాత్మక శక్తిని ఉపయోగించుకుంటోంది. ఇది అసలైన, సాంస్కృతిక మూలాలతో కూడిన ఐపీలను ప్రోత్సహించడం ద్వారా భారత మీడియా రంగంలోని అంతరాలను భర్తీ చేస్తుంది. ప్రపంచ యానిమే రంగ అభివృద్ధి, పెరుగుతున్న డిజిటల్ అక్షరాస్యత క్రమంలో, విద్యార్థులు, నిపుణులు వారి ఆలోచనలను ప్రదర్శించేందుకు ఒక చక్కని వేదికను వామ్! అందిస్తుంది. ఇది పూర్తిగా సంసిద్ధం చేసిన ఐపీలను అభివృద్ధి చేయడానికి, పరిశ్రమ మార్గదర్శకత్వం అలాగే ప్రభుత్వ సహకారాన్ని పొందడానికి స్పష్టమైన మార్గాన్నీ అందిస్తుంది.

ఈ దార్శనికతను సాకారం చేసే దిశగా మాంగా (విద్యార్థులు, ప్రొఫెషనల్), యానిమే (విద్యార్థులు, ప్రొఫెషనల్), వెబ్‌టూన్ (విద్యార్థులు, ప్రొఫెషనల్), వాయిస్ యాక్టింగ్, కాస్‌ప్లే వంటి బహుళ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. విద్యార్థులు, ప్రొఫెషనల్ కేటగిరీల నుంచి పార్టిసిపెంట్స్‌ను వడబోసి ఎంపిక చేశారు. గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, వారణాసి, ఢిల్లీ, ముంబయి, నాగ్‌పూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి 11 నగరాల్లో పోటీలను నిర్వహించడం ద్వారా గ్రౌండ్-అప్ విధానాన్ని వామ్! అనుసరించింది. యానిమేషన్, కామిక్స్, మీడియా-వినోద రంగాలకు చెందిన పరిశ్రమ నిపుణులతో కూడిన విశిష్ట జ్యూరీ ప్రతి నగరం నుంచి విజేతలను ఎంపిక చేసింది. విభిన్న స్వరాలు, కథను చెప్పే విధానాలను సూచించే అధిక-సామర్థ్యం గల ప్రతిభను ఎంపిక చేసింది. ప్రాంతీయ స్థాయి పోటీలు భారతదేశపు గొప్ప భాషా, కళాత్మక వైవిధ్యాన్ని చాటుతూ, సృజనాత్మక ప్రతిభకు సరిహద్దులు లేవని నిరూపించాయి.

ఈ బలమైన పునాదిపై జరగనున్న జాతీయస్థాయి తుదిపోటీ కేవలం ఒక వేడుకగా మాత్రమే కాకుండా ఒక లాంచ్‌ప్యాడ్‌గా నిలవనుంది. పార్టిసిపెంట్స్‌ను ఈ రంగంలోని అన్ని నైపుణ్యాలతో సిద్ధం చేయడం కోసం రూపొందించిన ఈ పోటీ లైవ్ పిచింగ్ సెషన్స్, ప్రొడక్షన్ స్టూడియోలతో నెట్‌వర్కింగ్, అంతర్జాతీయ మీడియా దిగ్గజాలతో అందుబాటులో గల అవకాశాలను ప్రదర్శించనుంది.

ఎంపికైన క్రియేటర్స్ ఇప్పుడు వేవ్స్ 2025లో భాగంగా నిర్వహిస్తున్న వామ్! జాతీయస్థాయి తుదిపోటీల కోసం ముంబయికి వెళ్తున్నారు, అక్కడ వారు అంతర్జాతీయ జ్యూరీ, ప్రేక్షకుల సమక్షంలో వారి కళను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. దీంతో ఈ తుదిపోటీలు అత్యంత ఉత్సాహంగా సాగనున్నాయి, విజేతలు కింది వాటిని అందుకుంటారు:

·         టోక్యోలో జరగనున్న యానిమే జపాన్ 2026 పర్యటనకు అయ్యే అన్ని ఖర్చుల చెల్లింపు

·         గుల్మోహార్ మీడియా ద్వారా హిందీ, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో యానిమే డబ్బింగ్

·         టూన్‌సూత్ర ద్వారా వెబ్‌టూన్ పబ్లిషింగ్

వామ్ కేవలం పోటీ మాత్రమే కాదు, భారతీయ కథల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించదగిన, భారత మూలాలతో కూడిన అసలైన కంటెంట్ లేదనే భారత మీడియా రంగంలోని ఒక ముఖ్యమైన అంతరాన్ని పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన సాంస్కృతిక ఉద్యమం. వేవ్స్ 2025 సమయం సమీపిస్తున్న కొద్దీ, ఉత్సాహం మరింత పెరుగుతోంది. ఇది ప్రతిభ, వాస్తవికత, కథను చెప్పే విధానంలో వచ్చిన పరివర్తనా శక్తిని ప్రతిబింబించే వేడుకగా నిలవనుంది.

 

eferences

Click here to download PDF

 

***


Release ID: (Release ID: 2123327)   |   Visitor Counter: 37