మీరు ఇదివరకటి గడువును మిస్సయ్యుంటే, దరఖాస్తును సమర్పించడంతోపాటు వినోద ప్రపంచ భావి రూపు రేఖలను తీర్చిదిద్దే పరిశ్రమ వృత్తినిపుణులతో ముఖాముఖి కార్యక్రమాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు, విశిష్ట సమావేశాల్లో పాలుపంచుకునేందుకు నమోదు చేసుకోవడానికి చివరి అవకాశం ఇదే సుమా.
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే...?
· పత్రికారంగం, టెలివిజన్, రేడియో... ఈ రంగాల్లోని జర్నలిస్టులు
· ఫోటోగ్రాఫర్లు లేదా కెమెరాపర్సన్లు
· ఫ్రీలాన్స్ మీడియా ప్రొఫెషనల్స్
· డిజిటల్ కంటెంట్‌ను రూపొందించేవారు
దాఖలు చేయాల్సిన పత్రాలు:
· ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రం
· పాస్‌పోర్ట్ సైజు ఫోటో
· మీడియాతో మీకు గల అనుబంధాన్ని తెలిపే రుజువు
· మీరు రూపొందించిన పది నమూనాలు (లింకులు లేదా స్క్రీన్‌షాట్లు)
· వీసా (మీరు విదేశీ దరఖాస్తుదారులు అయితే)
నమోదు ప్రక్రియ మొదలయ్యే తేదీ: ఏప్రిల్ 21, 2025
నమోదు ప్రక్రియ ముగిసే తేదీ: ఏప్రిల్ 23, 2025న రాత్రి 11:59 నిమిషాలకు.
ఆమోదం లభించిన ప్రతినిధులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అంతేకాక వాస్తవ కాల తాజా సమాచారాన్ని అందించడం కోసం వారిని అధికారిక వాట్సాప్ గ్రూపులో కూడా చేర్చుకొంటారు.
మమ్మల్ని pibwaves.media[at]gmail[dot]com లో విషయం: WAVES Media Accreditation Query ద్వారా గాని,
లేదా మా హెల్ప్‌లైన్ నంబరు: 9643034368ను ఉపయోగించి గాని సంప్రదించగలరు.
మీడియా ప్రతినిధి నమోదు విధానాన్ని తెలుసుకోండి here
‘వేవ్స్’తో కలసి ప్రయాణించడానికి మీకు లభించిన ఆఖరి అవకాశాన్ని చేజార్చుకో కండి.
వేవ్స్ గురించి (About WAVES) ::
ప్రసార మాధ్యమాలు, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో మహత్తర కార్యక్రమంగా నిలిచిపోనున్న ఈ దృశ్య, శ్రవణ, వినోద ప్రధాన ప్రపంచ శిఖరాగ్ర సదస్సు (‘వేవ్స్’)ను భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్ర లోని ముంబయిలో నిర్వహించనుంది.
మీరు ఈ పరిశ్రమకు చెందిన వృత్తినిపుణులు, పెట్టుబడిదారు, సృజనశీలి లేదా ఆవిష్కర్త... ఇలా ఏ పాత్రను పోషిస్తున్నా సరే... ప్రసార మాధ్యమాలు, వినోద పరిశ్రమ (ఎం అండ్ ఈ)తో మీరు అనుసంధానం కావడానికి, మీ వంతు తోడ్పాటును అందించడానికి, ఎం అండ్ ఈతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి అపురూపమైన అంతర్జాతీయ వేదికను ఈ శిఖరాగ్ర సదస్సు మీకు అందిస్తుంది.
భారత్‌లో సృజనాత్మక శక్తిని ప్రోత్సహిస్తూ, కంటెట్ రూపకల్పన, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు ఒక కూడలి (హబ్)గా ఇండియా స్థానాన్ని పటిష్ఠపరచడానికి ‘వేవ్స్’ సర్వసన్నద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రసార రంగం, పత్రికారంగం, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం-సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్) తదితర రంగాలపైనా, పరిశ్రమలపైనా ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.