WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ ఫిల్మ్ పోస్టర్ మేకింగ్ ఛాలెంజ్ టాప్ 50 డిజిటల్ పోస్టర్ విజేతల ప్రకటన


ముంబయిలో జరిగే వేవ్స్ లో తుది అవార్డుల వెల్లడి

వేవ్స్ లో లైవ్ హ్యాండ్ పెయింటెడ్ పోస్టర్ మేకింగ్ పోటీలో పాల్గొనేందుకు 10 మంది ఎంపిక

 Posted On: 19 APR 2025 1:00PM |   Location: PIB Hyderabad

దేశవ్యాప్తంగా కళాకారుల నుంచి అపూర్వ స్పందన వచ్చిన నేపథ్యంలో, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) తన ఫిల్మ్ పోస్టర్ తయారీ పోటీకి సంబంధించి టాప్ 50 డిజిటల్ పోస్టర్ విజేతలను ప్రకటించింది. వర్ధమాన దృశ్య కథకుల అభిరుచి, ఆవిష్కరణను ప్రతిబింబించే ఈ పోటీకి 542 డిజిటల్ ఎంట్రీలు వచ్చాయి. హ్యాండ్ పెయింటెడ్ పోస్టర్ తయారీ పోటీలో దేశవ్యాప్తంగా వివిధ కళా సంస్థల నుంచి 10 ఎంట్రీలు ఎంపికయ్యాయి. ముంబయిలో జరిగే వేవ్ సదస్సులోజరిగే లైవ్ ఫినాలేలో విజేతలను ఎంపిక చేస్తారు.

డిజిటల్ పోస్టర్ మేకింగ్ పోటీ

ఫోటోగ్రాఫర్, మ్యూజియో కెమేరా గురుగ్రాం వ్యవస్థాపక డైరెక్టర్ ఆదిత్య ఆర్య, కళాకారుడు,  సౌత్ ఢిల్లీ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వైస్ ప్రిన్సిపల్ ఆనంద మోయ్ బెనర్జీతో కూడిన జ్యూరీ, కో-ఆర్గనైజర్స్ అయిన ఇమాజినేషన్ స్ట్రీట్ ఆర్ట్,  నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా కలసి ఎంతో పలు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. సృజనాత్మకత, సహజత్వం, ప్రభావవంతంగా కథ చెప్పడం ఆధారంగా జ్యూరీ 197 పోస్టర్ల ప్రాథమిక షార్ట్ లిస్ట్ నుంచి ఫైనల్ టాప్ 50ని ఎంపిక చేసింది.

టాప్ 50లో ముగ్గురు ప్రముఖ ఫైనలిస్టులను గుర్తించారు (అక్షర క్రమంలో):

  • సప్తోసింధు సేన్ గుప్తా

  • శివాంగి శర్మ కశ్యప్

  • సురేష్ డి నాయర్

ఈ ఏడాది మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరిగే వేవ్ సదస్సులో టాప్-3 ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ 50 మంది విజేతల పోస్టర్లను కూడా సదస్సులో డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తారు. తద్వారా పాల్గొనే వారు గుర్తింపు, ప్రసిద్ధి పొందడానికి విలువైన వేదికను అందించనున్నారు.

వేవ్స్ లో ప్రత్యక్ష పోటీ ద్వారా హ్యాండ్ పెయింటెడ్ పోస్టర్ ఆర్ట్ ప్రదర్శన

ఒకప్పుడు భారతీయ సినిమాకు దృశ్యపరంగా గుర్తింపును ఇచ్చిన సంప్రదాయ కళారూపాన్ని ఆవిష్కరిస్తూ, లైవ్ హ్యాండ్-పెయింటెడ్ ఫిల్మ్ పోస్టర్ మేకింగ్ పోటీని వేవ్స్ నిర్వహించనుంది. ఎంఎఫ్ హుస్సేన్, ఎస్ఎం పండిట్ వంటి దిగ్గజ కళాకారుల స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ విభాగం చేతితో చిత్రించిన పోస్టర్ల గొప్ప వారసత్వాన్ని గౌరవిస్తుంది.

మొత్తం ఎంట్రీలలో 10 మంది విద్యార్థి కళాకారులను వేవ్స్ లైవ్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వారు స్వయంగా హ్యాండ్-పెయింటెడ్ ఫిల్మ్ పోస్టర్లు రూపొందిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. సాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన ఈ మాధ్యమానికి చేసిన విశేష కృషికి గాను మొదటి ముగ్గురు విజేతలను గుర్తించి బహుమతులు అందజేస్తారు.

సినిమా పోస్టర్ తయారీ పోటీ గురించి

వేవ్స్ ఫిల్మ్ పోస్టర్ తయారీ పోటీ అనేది సినిమా కళను ఘనంగా జరుపుకోవడానికి, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి,  దృశ్య కథ సాంప్రదాయ, సమకాలీన రూపాలను అనుసంధానించడానికి ఒక విస్తృత చొరవలో భాగం. మరింత సమాచారం, విజేతల పూర్తి జాబితా కోసం, సందర్శించండి:

https://www.nfdcindia.com/waves-poster-challenge-2025/

వేవ్స్ గురించి

మీడియా, వినోద రంగాలలో నూతన అధ్యాయంగా మొదటి వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సదస్సును భారత ప్రభుత్వం 2025 మే 1 నుంచి 4 వరకు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహిస్తుంది.

మీరు మీడియా, వినోదరంగంలో ఉన్న నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనశీలులైనా లేదా నూతన ఆవిష్కర్తలైనా, మీరు అనుసంధానం కావడానికి, భాగస్వాములుగా మారడానికి, కొత్తదనం తీసుకురావడానికి,  మీడియా, వినోద రంగాల అభివృద్ధికి తోడ్పడేందుకు ఈ సదస్సు అత్యుత్తమ గ్లోబల్ వేదికగా నిలుస్తుంది.

విషయ (కంటెంట్)  సృష్టి, మేధో సంపత్తి సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా భారతదేశ సృజనాత్మక శక్తిని పెంచడానికి వేవ్స్ సిద్ధంగా ఉంది. ఇది దృష్టి సారించే రంగాలలో -  బ్రాడ్ కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్ టెండెడ్ రియాలిటీ మొదలైనవి ఉన్నాయి. 

ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాలు ఇక్కడ కనుగొనండి.

వేవ్స్ పిఐబి టీమ్ నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోండి.

రండి, మాతో ప్రయాణించండి! వేవ్స్ కోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

 

***


Release ID: (Release ID: 2122964)   |   Visitor Counter: 27