ప్రధాన మంత్రి కార్యాలయం
దాదీ రతన్ మోహినీ మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి
దయామయిగా, జ్ఞానమయిగా, వెలుగులు పంచిన మూర్తిగా ఆమెను చిరకాలం గుర్తుంచుకుంటాం
Posted On:
08 APR 2025 5:04PM by PIB Hyderabad
బ్రహ్మకుమారి ధార్మిక సంస్థ ఆధ్యాత్మిక గురువు దాదీ రతన్ మోహినీ జీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దయామయిగా, జ్ఞానమయిగా, వెలుగులు పంచిన మూర్తిగా ఆమెను చిరకాలం గుర్తుంచుకుంటామని ప్రధాని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మకుమారి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె సమర్థమైన నాయకత్వ పాత్ర మరువలేనిదని ప్రశంసించారు. దాదీతో తనకు గల ప్రత్యక్ష అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, మనః శాంతిని ఆశించేవారు, సమాజ ఉద్ధరణకు కంకణం కట్టుకున్న వారికి ఆమె మార్గనిర్దేశనం, జీవితం స్ఫూర్తిదాయకాలని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్ పై పోస్ట్ చేసిన ప్రధాని..
“మేరు శిఖరం వంటి దాదీ రతన్ మోహినీజీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఎంతో ప్రభావం చూపింది. దయామయిగా, జ్ఞానమయిగా, వెలుగులు పంచిన మూర్తిగా ఆమెను చిరకాలం గుర్తుంచుకుంటాం. అచంచల విశ్వాసం, సరళమైన జీవనశైలి, సేవ పట్ల తిరుగులేని నిబద్ధత కలబోతల ఆమె జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిని కలిగించగలదు. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మకుమారి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె సమర్థమైన నాయకత్వ పాత్ర మరువలేనిది. వినయం, సహనం, కరుణ, ఆలోచనల్లో స్పష్టత వంటి గుణాలు దాదీని ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. మనః శాంతిని ఆశించేవారు, సమాజ ఉద్ధరణకు కంకణం కట్టుకున్న వారికి ఆమె మార్గనిర్దేశనం, జీవితం స్ఫూర్తిదాయకాలుగా కొనసాగుతాయి. దాదీతో గల నాకు గల అనుబంధం, జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. ఈ కష్ట సమయంలో ఆమె అభిమానులకు, అంతర్జాతీయ బ్రహ్మ కుమారీ సమాజానికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి!” అని పేర్కొన్నారు.
***
(Release ID: 2120194)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam