ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ సముద్ర దినోత్సవం నేపథ్యంలో సముద్ర రంగం... ఓడరేవుల బలోపేతానికి ప్రభుత్వ నిబద్ధతపై ప్రధాని పునరుద్ఘాటన

Posted On: 05 APR 2025 9:06AM by PIB Hyderabad

జాతీయ సముద్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతి దిశగా సముద్ర రంగంతోపాటు ఓడరేవుల బలోపేతంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

   “జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా భారత సుసంపన్న సముద్ర చరిత్రను, దేశ పురోగమనంలో ఈ రంగం పోషించిన అద్వితీయ పాత్రను ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ సర్వతోముఖాభివృద్ధి దిశగా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసే కృషిని ఇకపైనా కొనసాగిస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

                                                                                                               ****


(Release ID: 2119743) Visitor Counter : 21