ప్రధాన మంత్రి కార్యాలయం
విదేశీ నేతలకిచ్చే అత్యున్నత పురస్కారంతో ప్రధానమంత్రికి శ్రీలంక సత్కారం
Posted On:
05 APR 2025 5:47PM by PIB Hyderabad
శ్రీలంక ప్రభుత్వం విదేశీ నేతలకిచ్చే అత్యున్నత పురస్కారం “శ్రీలంక మిత్ర విభూషణ”తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆ దేశాధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే సత్కరించారు. భారత్ నుంచి ఒక నాయకుడు ఈ అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి. భారత్-శ్రీలంక స్నేహసంబంధాల బలోపేతానికి నిరంతరం కృషి చేసినందుకుగాను ప్రధానమంత్రికి ఈ పురస్కార ప్రదానం చేశారు.
దేశంలోని 140 కోట్ల మంది ప్రజల తరపున ఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ- ఇది భారత్-శ్రీలంక విశిష్ట స్నేహ బంధానికి, రెండు దేశాల ప్రజల మధ్య అనాదిగా కొనసాగుతున్న సౌహార్ద సంబంధాలకు దక్కిన గౌరవమని ప్రధానమంత్రి అభివర్ణించారు.
(Release ID: 2119740)
Visitor Counter : 27