ప్రధాన మంత్రి కార్యాలయం
చర్యల జాబితా: ఆరో బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
04 APR 2025 2:32PM by PIB Hyderabad
సభాకార్యకలాపాలు
* బిమ్స్‌టెక్ వాణిజ్య మండలి ఏర్పాటు.
* బిమ్స్‌టెక్ సభాకార్యకలాపాల శిఖరాగ్ర సదస్సును ఏటా నిర్వహించడం.
* బిమ్స్‌టెక్ ప్రాంతంలో స్థానిక కరెన్సీలో వ్యాపార నిర్వహణ సాధ్యపడుతుందా అనే అంశాన్ని అధ్యయనం చేయడం.
ఐటీ
* డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో సంపాదించిన అనుభవాన్ని పంచుకోవడానికి బిమ్స్‌టెక్ సభ్యదేశాల అవసరాలను తెలుసుకొనేందుకుగాను ఒక ప్రయోగాత్మక అధ్యయనాన్ని చేపట్టడం.
* యూపీఐకి, బిమ్స్‌టెక్ ప్రాంతంలో చెల్లింపు వ్యవస్థలకు మధ్య సంధానాన్ని ఏర్పరచడం.
విపత్తుల నిర్వహణ, ఉపశమన చర్యలు
* విపత్తులు సంభవించిన సందర్భాల్లో నిర్వహణ- ఉపశమన చర్యలు, పునరావాస కల్పనలో సహకారాన్ని అందించడానికి భారత్‌లో బిమ్స్‌టెక్ ఎక్స్‌లెన్స్ సెంటరును ఏర్పాటు చేయడం.
* భారత్‌లో ఈ సంవత్సరం బిమ్స్‌టెక్ ప్రాంత విపత్తు నిర్వహణ అధికారుల మధ్య నాలుగో సంయుక్త కార్యాచరణను ఏర్పాటు చేయనున్నారు.
భద్రత
* హోం మంత్రుల మొట్టమొదటి సమావేశాన్ని భారత్‌లో నిర్వహించనున్నారు.
అంతరిక్ష రంగం
* బిమ్స్‌టెక్ దేశాల మావన వనరుల శిక్షణ, నానో శాటిలైట్ నిర్మాణం-ప్రయోగం, రిమోట్ డేటా ఉపయోగం.. వీటి కోసం గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం.
సామర్థ్యాలు పెంచే కార్యక్రమాలు, శిక్షణ
* ‘బిమ్స్‌టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (బీఓడీహెచ్ఐ.. ‘బోధి’) కార్యక్రమాన్ని అమలుచేయడం. ఈ కార్యక్రమంలో భాగంగా, బిమ్స్‌టెక్ దేశాలకు చెందిన 300 మంది యువజనులకు ప్రతి సంవత్సరం ఇండియాలో శిక్షణనిస్తారు.
* ఫారెస్ట్రీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బిమ్స్‌టెక్ విద్యార్థులకు ఉపకార వేతనాలతోపాటు, నలందా విశ్వవిద్యాలయంలో అమలవుతున్న ఉపకార వేతన పథకం విస్తరణ.
* బిమ్స్‌టెక్ దేశాల యువ దౌత్యవేత్తలకు ప్రతి సంవత్సరం శిక్షణ కార్యక్రమం.
* బిమ్స్‌టెక్ దేశాల్లో క్యాన్సర్ సంబంధిత సంరక్షణలో శిక్షణ కార్యక్రమాలకు, సామర్థ్యాల్ని పెంచే కార్యక్రమాలకు టాటా మెమోరియల్ సెంటర్ అండదండలు అందించనుంది.
* సాంప్రదాయక వైద్యంలో పరిశోధన, వ్యాప్తి.. ఈ ఉద్దేశాలతో ఒక ఎక్స్‌లెన్స్ సెంటరును ఏర్పాటు చేస్తారు.
* రైతులకు లాభదాయకంగా ఉండేలా జ్ఞానాన్ని, అత్యుత్తమ పద్ధతులను, పరిశోధన ఫలితాలను, సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్‌లో ఒక ఎక్స్‌లెన్స్ సెంటరును ఏర్పాటు చేయనున్నారు.
ఇంధనం
* బెంగళూరులో బిమ్స్‌టెక్ ఎనర్జీ సెంటర్ పనిచేయడం మొదలుపెట్టింది.
* విద్యుత్తు గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్‌కు సంబంధించిన పనులు వేగంగా పూర్తి అయ్యేటట్లు చూస్తారు.
యువత భాగస్వామ్యం
* బిమ్స్‌టెక్ యువ నేతల శిఖరాగ్ర సదస్సును ఈ సంవత్సరంలో నిర్వహించనున్నారు.
* బిమ్స్‌టెక్ హ్యాకథాన్-యంగ్ ప్రొఫెషనల్ విజిటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
క్రీడలు
* ‘బిమ్స్‌టెక్ అథ్లెటిక్స్ మీట్’ను ఈ సంవత్సరం భారత్‌లో నిర్వహించనున్నారు.
* 2027లో మొట్టమొదటిసారిగా ‘బిమ్స్‌టెక్ గేమ్స్’ను నిర్వహణ.
సంస్కృతి
* బిమ్స్‌టెక్ సాంప్రదాయక సంగీత ఉత్సవాన్ని ఈ సంవత్సరం భారత్‌లో నిర్వహించనున్నారు.
సంధానం
* సామర్థ్యాలను పెంచే కార్యక్రమాలు, పరిశోధన, నవకల్పన, సముద్ర సంబంధిత విధానాలలో సమన్వయాన్ని ఇప్పటికన్నా పెంచే దిశలో కృషి చేయడానికి సస్టేనబుల్ మారిటైం ట్రాన్స్‌పోర్ట్ సెంటరును భారత్‌లో ఏర్పాటు చేస్తారు.
***
(Release ID: 2119121)
Visitor Counter : 16