ప్రధాన మంత్రి కార్యాలయం
థాయ్‌లాండ్ మాజీ ప్రధానితో మోదీ భేటీ
Posted On:
03 APR 2025 6:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ మాజీ ప్రధాని శ్రీ తక్సిన్ షినావత్రాతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సంస్కృతి తదితర రంగాల్లో భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య సహకారానికి ఉన్న అపార అవకాశాలపై చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు.
'థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినావత్రాను కలవడం ఆనందంగా ఉంది. పాలన, విధాన రూపకల్పనకు సంబంధించిన విషయాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ఆయన భారత్‌కు గొప్ప మిత్రుడు. అటల్ జీతో చాలా ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారు.
శ్రీ షినావత్రా, నేను భారత్-థాయ్‌లాండ్ సహకారం గురించి, అది మన దేశాల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. రక్షణ, వాణిజ్యం, సంస్కృతి తదితర రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలపై చర్చించాం.
@ThaksinLive"
(Release ID: 2118641)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam