ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వేసవి సెలవులను ఎదగడానికి, జ్ఞానార్జనకు ఉపయోగించుకోండి: యువతను ప్రోత్సహించిన ప్రధానమంత్రి

Posted On: 01 APR 2025 12:05PM by PIB Hyderabad

దేశమంతటా యువ మిత్రులకు వేసవి సెలవులు మొదలవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెలవుల కాలాన్ని ఆనందం, జ్ఞానార్జనలతోపాటు జీవితంలో వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలంటూ వారిని ప్రధాని ప్రోత్సహించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో లోక్‌సభ ఎంపీ శ్రీ తేజస్వి సూర్య పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని స్పందిస్తూ:


‘‘సంతోషదాయకమైన సెలవుల్లో  ఒక అద్భుతమైన అనుభూతి నా యువ మిత్రులందరికీ దక్కాలని కోరుకుంటున్నాను. కిందటి ఆదివారం ‘మన్‌ కీ బాత్’ ( #MannKiBaat) కార్యక్రమంలో నేను చెప్పినట్లు, వేసవి సెలవులు ఆనందించడానికీ నేర్చుకోవడానికీ జీవనంలో ఎదగడానికీ ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. సెలవుల కాలంలో ఈ దిశగా ప్రయత్నాలు చేయడం.. అదీ గొప్పతనం’’ అని పేర్కొన్నారు.  

 

 

***

MJPS/SR


(Release ID: 2117198) Visitor Counter : 24