సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘వేవ్స్’ కథనాల ప్రచురణలో అలల్లా ఉవ్వెత్తున ఎగసిపడండి..అక్షరాలా!


• ప్రపంచ దృశ్య శ్రవణ వినోద ప్రధాన శిఖరాగ్ర సదస్సు (‘వేవ్స్’) 2025 కు మొదలైన ప్రసార మాధ్యమ ప్రతినిధుల నమోదు ప్రక్రియ

• ముంబయిలో మే నెల 1 నుంచి 4 మధ్య తొలి వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో వినోదరంగం భవిష్యత్తు రూపురేఖల్ని గమనించండి

Posted On: 26 MAR 2025 2:04PM by PIB Hyderabad

ప్రపంచ దృశ్య శ్రవణ వినోద ప్రధాన శిఖరాగ్ర సదస్సు (‘వేవ్స్’) 2025 ను ముంబయిలో మే నెల 1 నుంచి 4 తేదీల మధ్య నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ ప్రసార మాధ్యమాలు, వినోదం (ఎం అండ్ ఈ) పరిశ్రమలో కొత్త సంచలనాన్ని సృష్టించనుంది. సన్నాహక చర్యలు ఊపు అందుకుంటున్న క్రమంలో, ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమ కథనాలను, విశేషాంశాలను ప్రజలకు చేరవేయడానికి పత్రికా రచయితలు, ఫోటోగ్రాఫర్లు, కంటెంట్ సృజనకారులతోపాటు ప్రసార మాధ్యమాలకు చెందిన వృత్తి నిపుణులను ఆహ్వానిస్తూ వివిధ ప్రసార మాధ్యమాల ప్రతినిధుల నమోదు ప్రక్రియను మార్చి నెల 26 నుంచి ప్రారంభించారు. రానున్న కాలంలో భారత ఎం అండ్ ఈ రంగం పురోగతి రూపురేఖలను చాటిచెప్పే కథనాల ద్వారా సృజనశీలురిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధం అవ్వండి. మీరు ఈ కార్యక్రమాన్ని గురించి తెలిపే వార్తా మాలిక ‘వేవ్స్’ (అలలను) ఎగసిపడేటట్టు చేయగలదు సుమా.. అదీ... అక్షరాలా!

 

మీకు పత్రికా రచన పట్ల, ప్రసార మాధ్యమ రంగం పట్ల, లేదా కథ చెప్పే కళ పట్ల తరగని మక్కువ ఉంటే.. మీరు ఒక విలేకరి, కెమెరామన్, లేదా కెమెరావుమన్ అయినా, లేక సామాజిక మాధ్యమ సంబంధిత వృత్తినిపుణుడో, నిపుణురాలో గాని అయితే.. అప్పుడు మీరు ‘వేవ్స్ 2025 ’ లో పాల్గొనకుండా ఉండలేరు! సంభాషణలో పాలుపంచుకోండి. పరిశ్రమ ప్రముఖుల అనుభవాల నుంచి కీలకాంశాల మెళకువల్ని ఒడిసిపట్టుకోండి. వర్ధమాన సృజనకారులు సరైన వేదికల మీద మెరిసేటట్లు మీరు మీ వంతుగా చేయూతను అందించండి. పరిశ్రమను చాలా దగ్గర నుంచి పరిశీలించగలగడానికీ, ప్రపంచ స్థాయి నెట్‌వర్కింగుకూ, ఎం అండ్ ఈ రంగంలో భూమి బద్దలయిపోయే తరహా సంచలనకారక ప్రయోగాల్ని ప్రత్యక్షంగా గమనించడానికీ సింహద్వారం నుంచి వేవ్స్ 2025 లోకి అడుగుపెట్టండి మరి.

ప్రసార మాధ్యమ ప్రతినిధుల నమోదు ప్రక్రియ

వేవ్స్ మీడియా ప్రతినిధిగా నమోదు చేసుకోవాలంటే, దరఖాస్తుదారులు..

ఈ ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు లేదా అంతకు మించిన వయస్సు వారై ఉండి తీరాలి. మీరు ఒక విలేకరి, లేదా ఫోటోగ్రాఫర్, కెమెరామన్ గాని లేదా కెమెరావుమన్, గుర్తింపు పొందిన వేదికపై డిజిటల్ మాధ్యమంలో కంటెంటును సమకూరుస్తున్న వారు అయి ఉండాలి.

  • పైన పేర్కొన్న యోగ్యతలను కలిగి ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కూడా ఉండవచ్చును.
  • ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా నమోదు చేసుకోవడానికి : https://app.wavesindia.org/register/media
  • నమోదు ప్రక్రియ మొదలయ్యే తేదీ: 2025 మార్చి 26
  • చివరి గడువు: 2025 ఏప్రిల్ 15 నాడు మధ్య రాత్రి 11:59 నిమిషాల వరకు (భారత కాలమానం ప్రకారం).
  • మీడియా ప్రతినిధి పాసును పొందడం: ప్రతినిధిగా గుర్తింపునకు నోచుకొన్న మీడియా రంగ వ్యక్తులకు పాసులను తీసుకోవడానికి సంబంధించిన వివరాల సమాచారాన్ని ఇస్తారు.
  • మీడియా ప్రతినిధి నమోదు విధానం వివరాలను తెలుసుకోండిక్కడ: here.

అనుబంధం ‘బి’ కి అనుగుణంగా ప్రసార మాధ్యమాల ప్రతినిధులు నమోదుకు సమర్పించాల్సిన పత్రాల జాబితాను చూడండిక్కడ: here.

ఏవైనా ప్రశ్నలు అడగదల్చుకొంటే వేవ్స్ మీడియా అక్రిడిటేషన్ క్వయిరీ’ (‘WAVES Media Accreditation Query) అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈమెయిల్ ద్వారా సంప్రదించండి: pibwaves.media[at]gmail[dot]com

 

  • చేసుకొనే వేళ దయచేసి అవసరపడే అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసే విషయంలో శ్రద్ధ తీసుకోగలరు. దరఖాస్తులను పరిశీలించిన తరువాత మీడియా ప్రాతినిధ్యానికి సంబంధించిన ఆమోదాన్ని ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) గుర్తింపు లభించిన ప్రసార మాధ్యమాల వారు మాత్రమే మీడియా డెలిగేట్ పాసులకు అర్హులవుతారు. సదరు ప్రసార మాధ్యమ రంగ సంస్థ విసృతి, ఎంత కాలానికి ఒకసారి ప్రజల చెంతకు చేరుతోంది, వినోద రంగంపై ఎంతగా శ్రద్ధ వహిస్తోంది అనే అంశాలతోపాటువేవ్స్’కు ఏ స్థాయిలో ప్రచారాన్ని కల్పించగలుగుతుందో అనే అంశాన్ని కూడా ఆధారంగా చేసుకుని ప్రాతినిధ్యాన్ని అనుమతిస్తారు.

ఎందుకీ WAVES?

వేవ్స్.. భారత్‌లో మొట్టమొదటి ప్రపంచ వేదిక. దేశానికి గల సృజనాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ కంటెంట్ సృజన, మేధాసంపత్తి, సాంకేతికత ప్రధాన నవకల్పనల కేంద్రం (హబ్)గా ఇండియాకు విశిష్ట స్థానాన్ని కల్పించడం వేవ్స్ ముఖ్యోద్దేశం. ఇది ప్రసార రంగం, ప్రచురణ మాధ్యమాలు, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్టులు, గేమింగ్, కామిక్స్, శబ్దం, సంగీతం, ప్రకటనల జగతి, డిజిటల్ ప్రసార మాధ్యమాలు, సామాజిక ప్రసార మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధ), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లతోపాటు ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్) సహా వివిధ పరిశ్రమల్లోని అగ్రగామి వృత్తినిపుణులను ఒక చోటుకు చేర్చనుంది.

మీరు ఎట్టి పరిస్థితుల్లోను చేజార్చుకోకూడని తరహా ముఖ్య అవకాశాలు ఇవిగో :

Create in India Challengeప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చే వర్థమాన సృజనశీలురు పండుగ చేసుకునే విలక్షణ కార్యక్రమమిది. దీని పేరు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్. ప్రతిభను ప్రదర్శించడానికి ముంబయిలో వేవ్స్ 2025 ఒక ప్రతిష్ఠాత్మక వేదికను అందుబాటులోకి తీసుకువస్తోంది.

WAVEX 2025 ప్రసార మాధ్యమాల రంగంలోని టెక్నాలజీ ప్రధాన అంకుర సంస్థలు వాటి వాటి ఆలోచనలను అగ్రగామి వెంచర్ క్యాపిటలిస్టుల ఎదుటా, పేరొందిన ఏంజెల్ ఇన్వెస్టర్ల ఎదుటా ఆవిష్కరించేందుకు ఒక అపురూప వేదికను అందిస్తుంది వేవెక్స్ 2025’. ఇది భారతదేశ ఎం అండ్ ఈ అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఎకోసిస్టమ్) భావి రూపురేఖలను తీర్చిదిద్దనుంది.

WAVES Bazaar .. చలనచిత్ర రంగం, గేమింగ్ రంగం, సంగీత రంగం, ప్రకటనల ప్రపంచం, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్) రంగం, ఇంకా మరిన్ని రంగాలతో సృజనాత్మక కళాకారులను, నూతన ఆవిష్కర్తలను, వ్యాపార సంస్థలను సంధానించే ఏకైక ప్రపంచ స్థాయి క్రయవిక్రయ కేంద్రం ఈ వేవ్స్ బజార్. ఇది పరిశ్రమకు చెందిన వృత్తినిపుణులకు కొత్త ఆదాయ మార్గాలను కూడా చూపుతుంది.

మాస్టర్‌ క్లాసులు, ముఖాముఖి కార్యక్రమాలు.. పరిశ్రమ దిగ్గజాలు, ప్రపంచ ప్రముఖుల సమక్షంలో నేర్చుకొనేందుకూ, ప్రసార మాధ్యమాలు, వినోదరంగం, టెక్నాలజీల భావి రూపురేఖలు ఎలా మారనుందీ అనే జ్ఞానాన్ని ఆర్జించడానికీ ఒక అరుదైన అవకాశం..

రండి, మాతో కలిసి ముందుకు సాగండి. మీరు సందర్శకులైతే నమోదు చేసుకోండిక్కడ: here; మీరొక విద్యార్థా, అయితే నమోదు చేసుకోండిక్కడ: here

తాజా ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ: PIB Team WAVES

మీరేమైనా ప్రశ్నలను అడగదలిచారా? అయితే సమాధానాలున్నాయిక్కడ: here

 


(Release ID: 2115185) Visitor Counter : 41