ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌లో న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్ అధికారిక పర్యటన ఒప్పందాలు

Posted On: 17 MAR 2025 2:27PM by PIB Hyderabad

ప్రకటనలు:

1. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, న్యూజిలాండ్ మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి.

2. వృత్తినిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారత్, న్యూజిలాండ్ మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి.

3. ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనీషియేటివ్ (ఐపీఓఐ)లో న్యూజిలాండ్ చేరింది.

4. విపత్తు నిరోధక మౌలిక వసతుల కల్పనకు పనిచేసే సంకీర్ణం (కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్..‘సీడీఆర్ఐ’)లో సభ్యదేశంగా న్యూజిలాండ్ చేరింది.

ద్వైపాక్షిక పత్రాలు:

1. సంయుక్త ప్రకటన

2. రక్షణ రంగంలో సహకారం దిశగా.. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు, న్యూజిలాండ్ రక్షణ మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

3. భారత పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర మండలి.. ‘సీబీఐసీ’కి, న్యూజిలాండ్ కస్టమ్స్ సర్వీసుకు మధ్య ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్-మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ (ఏఈఓ-ఎంఆర్ఏ) కుదిరింది.

4. తోటల పెంపకం దిశగా.. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు, న్యూజిలాండ్ ప్రాథమిక పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మధ్య  సహకార ఒప్పందం కుదిరింది.

5. అటవీ ప్రాంతాలను విస్తరించే అంశంపై భారత పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు, న్యూజిలాండ్ ప్రాథమిక పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మధ్య ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలయ్యాయి.

6. విద్యా రంగంలో సహకారం దిశగా.. భారత విద్యా మంత్రిత్వ శాఖకు, న్యూజిలాండ్ విద్యా మంత్రిత్వ శాఖకు మధ్య ఒప్పందం కుదిరింది.
7. క్రీడారంగంలో సహకారం దిశగా.. భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు, న్యూజిలాండ్ ప్రభుత్వ ఆధీనంలోని స్పోర్ట్ న్యూజిలాండ్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.


 

***


(Release ID: 2111903) Visitor Counter : 20