ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ శంకర్ రావు తత్వవాది మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
Posted On:
13 MAR 2025 8:53PM by PIB Hyderabad
డాక్టర్ శంకర్ రావు తత్వవాది మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జాతి నిర్మాణంలోనూ, భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలోనూ చేసిన విశేష కృషి ద్వారా డాక్టర్ శంకర్ రావు తత్వవాది ఎప్పటికీ గుర్తుండిపోతారని శ్రీ మోదీ నివాళలర్పించారు. “భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయనతో అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సైద్ధాంతిక స్పష్టత, నిశిత దృష్టితో కూడిన పనితీరు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేవి” అని శ్రీ మోదీ అన్నారు.
“డాక్టర్ శంకర్ రావు తత్వవాది ఇక లేరన్న వార్త నాకు బాధ కలిగించింది. దేశ నిర్మాణం, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఆయన చేసిన విస్తృతమైన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్‌కు అంకితం చేసి, ప్రపంచవ్యాప్తంగా దాని విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఒక విశిష్ట పండితుడు కూడా. ఎల్లప్పుడూ యువతలో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించేవారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) తో ఆయనకు గల అనుబంధాన్ని విద్యార్థులు, మేధావులు ప్రేమగా గుర్తుచేసుకుంటారు. ఇతర అభిరుచులతో పాటు ఆయనకు సైన్స్, సంస్కృతం, ఆధ్యాత్మికతపై అపారమైన ఆసక్తి ఉండేది. భారత్ లోనూ, విదేశాల్లోనూ ఆయనతో పలు సందర్భాల్లో సంభాషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సైద్ధాంతిక స్పష్టత, సునిశితమైన వ్యవహార శైలి ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలిచాయి. ఓం శాంతి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
***
(Release ID: 2111377)
Visitor Counter : 5