సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సృజనాత్మకత.. మీడియా.. సాంకేతికతల సమ్మేళనంతో ప్రపంచ మీడియా రంగం రూపాంతరీకరణ: అశ్వినీ వైష్ణవ్


· “అత్యున్నత విలువలతో కథన సృష్టి దిశగా సృష్టికర్తలకు ‘వేవ్స్‌’ ఉత్తమ వేదిక కాగలదు”

· మీడియా-వినోద పరిశ్రమలో చర్చలు.. సహకారం.. ఆవిష్కరణలను ప్రోత్సహించగల కీలక వేదిక ‘వేవ్స్‌-2025: కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్

· సాంకేతిక ప్రగతి.. సామాజిక మార్పులో మీడియా పరిణామశీల పాత్రను స్పష్టం చేసే ఉద్యమం ‘వేవ్స్‌-2025’: మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్

· భారత సృజనాత్మక రంగంతో ప్రపంచ మీడియా సంస్థలు మమేకమయ్యేలా ‘వేవ్స్‌’ తోడ్పడుతుంది: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్

· న్యూఢిల్లీలోని విదేశీ దౌత్య కార్యాలయాల రాయబారులు.. హై కమిషనర్ల కోసం ‘వేవ్స్‌-2025’పై సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యక్రమం

· సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ-మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం: మీడియా-వినోదం సహా డిజిటల్ విస్తృతిపై సహకారం బలోపేతం

Posted On: 13 MAR 2025 7:44PM by PIB Hyderabad

   మీడియా-వినోద రంగంలో అంతర్జాతీయ సహకార విస్తృతి లక్ష్యంగా చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు న్యూఢిల్లీలోని చాణక్యపురిలోగల సుష్మా స్వరాజ్ భవన్‌లో వేవ్స్‌-2025’పై ఉన్నత స్థాయి గోష్టి ఏర్పాటు చేసిందిముంబయిలో ఈ ఏడాది మే నుంచి వరకూ సాగే ‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్‌సన్నాహకాల్లో భాగంగా అంతర్జాతీయ సమాజాన్ని ఇందులో మమేకం చేయడం ధ్యేయంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం నిర్వహించింది.

   కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్.జైశంకర్ (విదేశీ వ్యవహారాలు), శ్రీ అశ్వినీ వైష్ణవ్ (సమాచార-ప్రసారరైల్వేఎలక్ట్రానిక్స్-ఐటీ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్కేంద్ర సమాచార-ప్రసారశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఅలాగే ఈ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్‌ జాజుమహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుజాత సౌనిక్లతోపాటు దాదాపు 100 మంది విదేశీ రాయబారులుహైకమిషనర్లు కూడా హాజరయ్యారు.

   మీడియా-వినోదంసహా డిజిటల్ విస్తృతిపై సహకారం బలోపేతం చేయడంలో భాగంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖమహారాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తికావడం ఈ కార్యక్రమ విశేషాంశం.

   ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ- “సృజనాత్మకతమీడియాసాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం ప్రపంచ మీడియా రంగం రూపాంతరీకరణకు తోడ్పడటమే కాకుండా ఈ దిశగా సంయుక్త కృషి సమున్నత స్థాయికి చేరుతుంది” అని వ్యాఖ్యానించారుఅలాగే “అన్ని రంగాల్లోని సృష్టికర్తల సమూహం అత్యున్నత విలువలతో కథన సృష్టి చేయగలదు... ‘వేవ్స్-2025’ ప్రధానోద్దేశం ఇదే”నని ఆయన పేర్కొన్నారు. “ఇందులో భాగంగానే ముంబయిలో మే నుంచి 4వ తేదీవరకూ నిర్వహించే ‘వేవ్స్‌-2025’కు సాంకేతికమీడియావినోద రంగాల్లో దిగ్గజాలను మేం ఆహ్వానిస్తున్నాం” అని ప్రకటించారుఅంతర్జాతీయ వేదికపై వివిధ రూపాల్లో భారత్‌ కృషిని విశదీకరిస్తూ- ‌ప్రపంచ స్థాయి సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చే రీతిలో ఈ రంగంలోని భాగస్వాములు కూడా ‘వేవ్స్‌-2025లో చురుగ్గా పాలుపంచుకోవాలని మంత్రి ఆహ్వానం పలికారు.

https://x.com/MIB_India/

   అనంతరం డాక్టర్ ఎస్.జైశంకర్ ప్రసంగిస్తూ- “మీడియా-వినోద పరిశ్రమలో చర్చలుసహకారంఆవిష్కరణలను ప్రోత్సహించగల కీలక వేదికగా ‘వేవ్స్-2025 ఉపయోగపడుతుందిపరిశ్రమలో దిగ్గజ సంస్థలుభాగస్వాములుఆవిష్కర్తలను ఏకం చేయడం ద్వారా అవకాశాల అన్వేషణసమస్యల పరిష్కారం సహా ఈ రంగం భవిష్యత్తు రూపమివ్వడంలోనూ తోడ్పడగలదు” అన్నారు. “ఆర్థిక-రాజకీయ పునఃసమతౌల్యం నేడు సాంస్కృతిక సమతౌల్యం దిశగా పయనిస్తోందిమనం స్థానికులుగా మమేకం కాలేకపోతే  ప్రపంచంతో మమేకం కాలేమన్నది వాస్తవంఈ దిశగా మన కృషి వెనుకగల స్ఫూర్తిని ‘వేవ్స్‌-2025’ ప్రతిబింబిస్తుంది” అని మంత్రి స్పష్టం చేశారుమరోవైపు “వేవ్స్‌-2025’ కింద అంతర్జాతీయ సహకార విస్తృతికిగల అవకాశాలపై రాయబారులుహై కమిషనర్లు వారి దేశాల్లోని ప్రభుత్వాలకు పూర్తి అవగాహన దిశగా చొరవ చూపాలి” అని కోరారు.

   మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ తన ప్రసంగంలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు. “ముంబయి నగరం భారత ఆర్థిక-వినోద రాజధాని కాబట్టి, ‘వేవ్స్‌-2025’ నిర్వహణకు ఇది అత్యంత సముచిత వేదికప్రాచీనఆధునిక సంస్కృతి ప్రభావాలను నిరంతరం మేళవిస్తూ మీడియావినోద రంగాల్లో సహకారంసాంస్కృతిక దౌత్యాన్ని ఈ నగరం ప్రోత్సహిస్తుంది” అని వివరించారుఅంతేకాకుండా “సాంకేతిక ప్రగతిసామాజిక మార్పులో మీడియా పరిణామశీల పాత్రను స్పష్టం చేసే ఉద్యమంగా ‘వేవ్స్-2025’ను పేర్కొనవచ్చుఅలాగే ఆవిష్కరణలకు తోడ్పడే ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరచే దిశగా పెట్టుబడులను ప్రోత్సహించేందుకూ మహారాష్ట్ర నిబద్ధతతో కృషి చేస్తుంది” అని స్పష్టం చేశారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ ఏర్పాటును స్వాగతిస్తూ- “సామాజిక శ్రేయస్సుకు తోడ్పడే శక్తిగా మీడియా తన పాత్రను కొనసాగిస్తుందనిభవిష్యత్తుకు రూపమిచ్చేలా ప్రపంచ అనుసంధానానికి స్ఫూర్తినిచ్చే సాంకేతికతసృజనాత్మకతల సమ్మేళనానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నాను” అని శ్రీ ఫడ్నవీస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

   కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తన ముగింపు ఉపన్యాసంలో- “సంయుక్త భాగస్వామ్యాలుసహ-నిర్మాణంవాణిజ్య విస్తరణకు ‘వేవ్స్‌-2025’ బాటలు వేస్తుందితద్వారా భారత సృజనాత్మక రంగంలో అంతర్జాతీయ మీడియా సంస్థలు మమేకమయ్యే వెసులుబాటు కల్పిస్తుంది” అని పేర్కొన్నారుఅదే సమయంలో “మీడియావినోద పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సానుకూల వాతావరణం ఏర్పరుస్తుందిఅందులో భాగంగా వాణిజ్య సౌలభ్యంసారాంశ స్థానికీకరణమౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు గట్టి మద్దతునిస్తుంది” అని భరోసా ఇచ్చారు.

   సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్‌ జాజు మాట్లాడుతూ- “యావత్‌ మీడియావినోద రంగానికి ప్రపంచంలోనే తొలి సమ్మిళిత వేదిక ‘వేవ్స్‌’... సంప్రదాయభవిష్యత్‌ మీడియా మధ్య అంతరం తగ్గింపుప్రపంచ భాగస్వామ్యాల కూర్పుసారాంశ సృష్టిసాంకేతిక ఆవిష్కరణలు వగైరాల్లో సుసంపన్న భారత సాంస్కృతిక సంప్రదాయాలను మేళవిచండమే మా లక్ష్యం” అని వివరించారు.

   అర్థవంతమైన ప్రభావ సృష్టి లక్ష్యంగా బహుళ కార్యక్రమాలతో ‘వేవ్స్‌” తొలి సంచికను నిర్వహిస్తున్నట్లు శ్రీ జాజు పేర్కొన్నారుఇందులో భాగంగా నిర్వహించే ప్రపంచ మీడియా చర్చలలో మంత్రులువిధాన నిర్ణేతలు పాల్గొంటారని చెప్పారుఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాలు ఒక ‘మార్గదర్శక విధాన పత్రంగా ‘వేవ్స్‌’ డిక్లరేషన్‌ రూపంలో ప్రకటిత అవుతుందని తెలిపారుఅలాగే ఉన్నతస్థాయి మేధా మధనం(థాట్ లీడర్స్ ట్రాక్పేరిట పరిశ్రమ నిపుణులతో విజ్ఞాన ఆదానప్రదాన గోష్ఠులు నిర్వహిస్తారని తెలిపారు. ‘ఆవిష్కరణాత్మక కథన రీతికథలో లీనంచేసే అనుభూతిగేమింగ్ రంగ వైవిధ్యం’ తదితరాలు ‘ప్రదర్శన’ విభాగంలో మన ముందుంటాయని చెప్పారుఇక భారత మీడియా వారసత్వంవిష్యత్తును భారత్ పెవిలియన్‌ ప్రముఖంగా ప్రదర్శిస్తుందిఅలాగే ‘వేవ్స్‌’ బజార్ వ్యాపార నెట్‌వర్కింగ్‌ సౌలభ్యం కల్పిస్తుందనిమీడియా అంకుర సంస్థలకు ‘వేవ్స్‌ ఎగ్జిలరేటర్’ మార్గదర్శకత్వం వహించడమే కాకుండా నిధులపరంగానూ మద్దతిస్తుందని శ్రీ జాజు వివరించారుఅటుపైన ‘వేవ్స్‌ కల్చరల్స్‌’ కింద జాతీయ-అంతర్జాతీయ ప్రతిభను మేళవించిన విభిన్న ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు.

వేవ్స్ 2025: డిజిటల్ శకంలో ఏకీకృత శక్తిగా మీడియా-వినోదం

   ముంబయిలో 2025 మే నుంచి 4వరకూ నిర్వహించే ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌)లో మీడియావినోదరంగాలకుగల రూపాంతరీకరణ శక్తిని ప్రతిబింబిస్తూ ఆయా రంగాల భాగస్వాములు పాల్గొంటారుఈ మేరకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలుమీడియా నిపుణులుకళాకారులువిధాన నిర్ణేతలుపరిశ్రమ భాగస్వాములు ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారునేటి డిజిటల్‌ శకం అవకాశాలతోపాటు సవాళ్లను కూడా మనముందు ఉంచుతోందికృత్రిమ మేధస్ట్రీమింగ్ విప్లవాలుమేధా సంపత్తి హక్కులుఅవాస్తవ సమాచారం, మీడియా స్థిరత్వం వంటివి నేటి కీలక సమస్యలుఈ నేపథ్యంలో సాంస్కృతిక వైవిధ్యంఆవిష్కరణమీడియా వేదికలను సమాన ప్రాతినిధ్యంతో  ప్రోత్సహించడం ద్వారా వేవ్స్‌-2025’ పేరిట తొలిసారి నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించగలదు.

   సారాంశ సృష్టి-విస్తృతిలో సృజనాత్మకతసార్వజనీనతబాధ్యతలతో కూడిన అత్యున్నత ప్రమాణాలను ఈ కార్యక్రమం ప్రస్ఫుటం చేస్తుందికథనాల్లో నైతికతసముచిత ప్రాతినిధ్యం తదితరాల ఆవశ్యకతను స్పష్టీకరిస్తుంది.

   సామరస్యమనే పట్టకం నుంచి ప్రపంచ వీక్షణ ద్వారా అర్థవంతమైన అనుబంధాలుసహకార విస్తృతిసాంస్కృతిక సమైక్యతలకు ప్రేరణనివ్వడం ‘వేవ్స్-2025’ ధ్యేయంనేటి డిజిటల్ శకంలో ప్రపంచ దేశాలుసంస్కృతులుప్రజానీకం మధ్య అతిపెద్ద ఏకీకరణ ఉత్ప్రేరకంగా మీడియా-వినోద పరిశ్రమ పాత్రను బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక ముందడుగు కాగలదుఉమ్మడి సమస్యలుమానవాళికి ఎదురవుతున్న సవాళ్లుభాగస్వామ్య అవకాశాలుసహకార విస్తృతి-పురోగమనంపై దృష్టి సారిస్తూ ఐక్యతకుగల శక్తిని వేవ్స్‌’ చాటిచెబుతుందిసామరస్యం కోసం సరిహద్దులకు అతీతంగా అర్థవంతమైన సంభాషణలు-చర్యలను ప్రోత్సహించే వేదికగా ‘వేవ్స్‌-2025ను సమున్నతంగా నిలిపేది ఈ దృక్పథమే.

   ‘సృజనార్థిక వ్యవస్థ’ (ఆరెంజ్ ఎకానమీ)లో ‘వేవ్స్‌-2025’ను ఏకీకృతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిఉద్యోగ సృష్టి దిశగా మీడియావినోద పరిశ్రమల సద్వినియోగంలో దాని కీలక పాత్ర స్పష్టమవుతోందిసాంస్కృతిక ఆదానప్రదానంఐక్యతకు సృజనాత్మక పరిశ్రమలు   శక్తిమంతమైన ఉపకరణాలు కాబట్టిఇది కచ్చితంగా ప్రపంచ సామరస్య లక్ష్య సాధనకు అనువైనదే.

   ముంబయిలో వేవ్స్‌-2025’ నిర్వహణ ద్వారా మేధామథన దిగ్గజాలకు ఇదొక సముచిత వేదిక అవుతుందివేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో మీడియా పరిశ్రమ అతిపెద్ద ఏకీకరణ ప్రేరకంగా ఎలా ఉపయోగపడగలదో వారు ఈ సందర్భంగా చర్చిస్తారుసాంస్కృతిక దౌత్యంతోపాటు ప్రజలుసంస్కృతులుదేశాల మధ్య అంతరాలను తగ్గించడంలో ఈ రంగం శక్తిమంతమైన ఉత్ప్రేరకం కాగలదు.

 

****


(Release ID: 2111376) Visitor Counter : 10