ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన భారతీయ క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
09 MAR 2025 10:10PM by PIB Hyderabad
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయాన్ని సాధించినందుకు భారతీయ క్రికెట్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు :
‘‘అసాధారణమైన ఆట.. అసాధారణమైన ఫలితం!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన దేశానికి తీసుకువస్తున్నందుకు మన క్రికెట్ జట్టును చూస్తే గర్వంగా ఉంది. టోర్నమెంటు మొదలైనప్పటి నుంచీ వాళ్లు అద్భుతంగా ఆడుతూవచ్చారు. అన్ని విభాగాల్లో అమోఘ ప్రదర్శనను కనబరిచినందుకు మన జట్టుకు అభినందనలు’’.
(Release ID: 2109769)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam