సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ కామిక్ క్రానికల్స్
Posted On:
24 FEB 2025 7:21PM by PIB Hyderabad
ఏఐ ఆధారిత కథా విధానంలో ఆలోచనలకు వాస్తవ రూపం.
వేవ్స్ కామిక్ క్రానికల్స్ సృజనాత్మక ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించబోతోంది. కథలు చెప్పడం వృత్తి లేదా వ్యాపకంగా తీసుకున్న వారు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పనిముట్లను ఉపయోగించుకుని తమ మెదడులోని ఆలోచనలకు అద్భుతమైన కామిక్స్ రూపం కల్పించేందుకు చక్కని అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సదస్సులో (వేవ్స్) భాగంగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు డాష్టూన్ స్టూడియో ద్వారా ఏఐ ఆధారిత కామిక్స్ రూపొందించి, తమ కథలను డాష్టూన్ మొబైల్ యాప్ పైన ప్రదర్శించవచ్చు. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ) నిర్వహిస్తున్న ఈ పోటీకి ఫిబ్రవరి 15వ తేదీ నాటికి 774 రిజిస్ర్టేషన్లు వచ్చాయి. డిజిటల్ కంటెంట్ రూపకల్పన పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఇది దర్పణం పడుతోంది.

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ జియో వరల్డ్ గార్డెన్లో ఈ ఏడాది మే 1 నుంచి 4 తేదీల మధ్య జరుగనున్న వేవ్స్ సదస్సు మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఒక్క చోటకు చేర్చే హబ్ అండ్ స్పోక్ వేదిక కానుంది. ప్రపంచ ప్రసిద్ధ ఈ ఈవెంట్ ప్రపంచ ఎం అండ్ ఈ పరిశ్రమ దృష్టిని భారత్ వైపు ఆకర్షించడంతో పాటు భారత ఎం అండ్ ఈ రంగాన్ని, దాని ప్రతిభను ప్రపంచంతో అనుసంధానం చేయనుంది.
నాలుగు మూలస్తంభాలపై ఈ ఈవెంట్ ను రూపొందించారు. అవి:
బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్, ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాల్టీ), డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్, చలన చిత్రాలు. డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్ విభాగంలోకి వచ్చే ఈ వేవ్స్ కామిక్ క్రానికల్స్ దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచం లోతులను అన్వేషించడంతో పాటు వర్థమాన ధోరణులు, టెక్నాలజీలు; విస్తరిస్తున్న యాప్ వ్యవస్థ, పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం, ప్రభావశీల మార్కెటింగ్ ధోరణుల గురించి అందరికీ తెలియచేస్తుంది. అంతే కాదు..డేటా గోప్యత, భద్రత వంటి రెగ్యులేటరీ సవాళ్ల గురించి కూడా చర్చించి నైతికతతో కూడిన కంటెంట్ రూపకల్పనను, డిజిటల్ వినియోగంలో బాధ్యతాయుత ధోరణిని ప్రోత్సహిస్తుంది.
సృజనాత్మకత, ఇన్నోవేషన్ ను ప్రోత్సహించాలన్న వేవ్స్ సదస్సు విజన్ ఆధారంగా సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో కార్యక్రమాన్ని రూపొందించింది. వేవ్స్ క్రానికల్స్ సహా అన్ని పోటీలకు కలిపి 73,000 పైగా రిజిస్ర్టేషన్లు వచ్చాయి. కంటెంట్ రూపకర్తలు ఆలోచనలకు తగినట్లు కళాత్మక అభివ్యక్తీకరణ, సాంకేతిక ప్రయోగశీలత, సాంస్కృతిక కథనాలతో జీవం పోసి చక్కని కథాంశంగా ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు ఇది చక్కని వేదిక అవుతుంది.
అర్హత

• ప్రపంచ స్థాయిలో పోటీ - అన్ని దేశాలు, జాతీయతలకు చెందిన వ్యక్తులు అర్హులే.
• జనరల్: పోటీలో అందరూ పాల్గొనవచ్చు.
విద్యార్థులు : ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో పూర్తి కాలం విద్యాభ్యాసం చేస్తున్న వారు.
• దరఖాస్తు స్వభావం : వ్యక్తులు, బృందాలు లేదా కంపెనీలు దరఖాస్తు చేయవచ్చు
• సెల్ఫ్ సర్టిఫికేషన్ : పాల్గొనే వారు తమ అర్హతకు సంబంధించిన అంశాలను స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే అనర్హులయ్యే ఆస్కారం ఉంటుంది.
• పాల్గొనేందుకు అనర్హులు : డాష్టూన్, గూగుల్ ప్లే; భారత ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ) ఉద్యోగులకు అర్హత లేదు.
మార్గదర్శకాలు
కామిక్ నిడివికి సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. కాని పోటీకి సమర్పించే కామిక్స్ ఏవైనా కనీసం 60 ప్యానెళ్లు (ఒక ఇమేజ్ లేదా ఒక దృశ్యం ఒక ప్యానెల్ గా పరిగణిస్తారు) కలిగి ఉండాలి.
కామిక్ వర్టికల్ స్క్రోల్ (వెబ్టూన్) ఫార్మాట్ ను అనుసరించాలి.
కామిక్ ఆంగ్లభాషలో ఉండాలి.
డాష్టూన్ స్టూడియోపై మాత్రమే అన్ని కామిక్లు రూపొందించాలి. డాష్టూన్ మొబైల్ యాప్ పైన ప్రచురించాలి. పోటీలో పాల్గొనే వారు పోస్ట్-ప్రొడక్షన్, ఎడిటింగ్ ఇతర పనిముట్లు వాడుకోవచ్చు. కాని తుది కామిక్ మాత్రం డాష్టూన్ స్టూడియో పైనే అసెంబుల్ చేసి డాష్టూన్ యాప్ ద్వారా మాత్రమే ప్రచురించాలి.
పోటీలో పాల్గొనే వారు తమ కామిక్ ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా వినియోగించుకునేందుకు లేదా సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది.
వాస్తవికత కీలకం: పాత్రలు గాని, కథ గాని ఏదైనా కాపీరైట్ మెటీరియల్ నుంచి కాపీ చేసినవై ఉండకూడదు (ఎలాంటి ఫ్యాన్ ఫిక్షన్ అనుమతించరు).
కంటెంట్ పరిమితులు : పోటీకి సమర్పించే వాటిలో ఈ దిగువ అంశాలు ఉండకూడదు.
- ఎన్ఎస్ఎఫ్ డబ్ల్యు లేదా లైంగికంగా అసభ్యకరమైన కథాంశం
- జాత్యహంకార లేదా కులతత్వ కథాంశం
- రాజకీయ లేదా ప్రచార కథాంశం
పోటీలో పాల్గొనే వారు తమకు ఇష్టమైన ఏ అంశాన్ని అయినా తీసుకోవచ్చు.
గతంలో ప్రచురించిన లేదా విడుదల చేసిన కథనాలు, వ్యక్తిగతంగా గాని లేదా మూడో వ్యక్తులెవరైనా గాని షేర్ చేసిన అంశాలు పోటీలో పరిశీలనకు సమర్పించకూడదు. ఎంట్రీలన్నీ కొత్తగా రూపొందించినవై ఉండాలి. ఇంతకు ముందు ప్రచురించినవి గాని లేదా గతంలో షేర్ చేసినవి గాని కాకూడదు.
గడువు

అదనపు రివార్డులు
టాప్ 3 విజేతలు : వేవ్స్ సదస్సులో కామిక్స్ ను ప్రదర్శించే అవకాశం.
టాప్ 25 పోటీదారులు : గూగుల్ ప్లే, డాష్టూన్ స్పాన్సర్ చేసి ఒక గుడీ బ్యాగ్. ప్రతిభకు గుర్తింపుగా సర్టిఫికెట్. ఐఏఎంఏఐ, డాష్టూన్ గుర్తింపు.
అందరు పోటీదారులు : చెల్లుబాటైన ఎంట్రీలన్నింటికీ సంబంధించిన పోటీదారులకు భాగస్వామ్య సర్టిఫికెట్
వేవ్స్ సదస్సులోని ప్రధాన కార్యక్రమం క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజెస్ విభాగంలో కీలకమైనది వేవ్స్ కామిక్ క్రానికల్స్. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో సృజనాత్మకతను, ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం; ప్రతిభకు పట్టం కట్టడం సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఈ పోటీ కార్యక్రమం లక్ష్యం. సదస్సులోని డిజిటల్ మీడియా, ఇన్నోవేషన్ విభాగంలో పోటీదారులు ఏఐ ఆధారిత పనిముట్లను ఉపయోగించుకుని డాష్టూన్ స్టూడియోపై వాస్తవిక కథలు రూపొందించడాన్ని వేవ్స్ కామిక్ క్రానికల్స్ ఆహ్వినిస్తుంది. ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా కళాత్మక, సాంకేతిక ప్రతిభలో భారతదేశాన్ని ప్రపంచ కూడలిగా నిలపాలన్న క్రియేట్ ఇన్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా ఈ పోటీ జరుగుతుంది.
***
(Release ID: 2106033)