ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా శ్రీ పర్వేశ్ సాహిబ్ సింగ్, శ్రీ ఆశీష్ సూద్, సర్దార్ మన్జిందర్ సింగ్ సిర్సా,
శ్రీ రవీందర్ ఇంద్రజ్ సింగ్, శ్రీ కపిల్ మిశ్రా, శ్రీ పంకజ్ కుమార్ సింగ్ పదవీప్రమాణ స్వీకారం..
Posted On:
20 FEB 2025 1:48PM by PIB Hyderabad
ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా శ్రీ పర్వేశ్ సాహిబ్ సింగ్, శ్రీ ఆశీష్ సూద్, సర్దార్ మన్జీందర్ సింగ్ సిర్సా, శ్రీ రవీందర్ ఇంద్రజ్ సింగ్, శ్రీ కపిల్ మిశ్రా, శ్రీ పంకజ్ కుమార్ సింగ్ పదవీప్రమాణం స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారిని అభినందించారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా శ్రీ పర్వేశ్ సాహిబ్ సింగ్ జీ, శ్రీ ఆశీష్ సూద్ జీ, సర్దార్ మన్జీందర్ సింగ్ సిర్సా జీ, శ్రీ రవీందర్ ఇంద్రజ్ సింగ్ జీ, శ్రీ కపిల్ మిశ్రా జీ, శ్రీ పంకజ్ కుమార్ సింగ్ జీ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా వారికి అభినందనలు. ఉత్సాహం తోపాటు అనుభవం చక్కగా మిళితం అయిన ఈ జట్టు.. ఢిల్లీకి తప్పక సుపరిపాలనను అందించగలుగుతుంది. వారికి శుభాకాంక్షలు.
@gupta_rekha
@p_sahibsingh
@mssirsa
@KapilMishra_IND” అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2104950)
Visitor Counter : 18
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam