సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేవ్స్ 2025 ‘‘రీల్ మేకింగ్’’ చాలెంజ్

Posted On: 11 FEB 2025 3:48PM by PIB Hyderabad

కథ చెప్పే కళలో భావి మార్పులకు రూపురేఖలు..

ఒక్కొక్కటిగా రీళ్లు

వేవ్స్ 2025 ‘రీల్ మేకింగ్’ చాలెంజ్ ఒక విశిష్టమైన పోటీఇది సృజనాత్మక కళాకారులకుఔత్సాహిక కళాకారులకు వారిలోని కథచెప్పే నైపుణ్యాల్ని మెటా ఉపకరణాలను ఉపయోగించుకొంటూ 30-90 సెకన్ల ఫిల్మ్ ఫార్మేట్‌లో ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తుంది.  సమాచారప్రసార శాఖ సహకారంతో ది ఇంటర్‌నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ నిర్వహేంచే ఈ చాలెంజ్‌కు ఘనమైన స్పందన లభించింది. 2025 ఫిబ్రవరి నాటికి భారత్ నలుమూలల నుంచి, 20 ఇతర దేశాల నుంచి 3,379 నమోదులు పూర్తయ్యాయి.  ఇది డిజిటల్ రూపకర్తలకు ప్రయోగాలు చేయడానికీనూతన ఆవిష్కరణలతోపాటు షార్ట్ ఫార్మ్ కంటెంట్ పరిధులను విస్తరించడానికి కూడా ఒక వేదికను అందిస్తుంది.   

ఈ చాలెంజ్ క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీల్లో ఒక భాగంక్రియేట్ ఇన్ ఇండియా పోటీలు అనేది వరల్డ్ ఆడియో విజువల్ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (డబ్ల్యూఏవీఈఎస్..వేవ్స్పర్యవేక్షణలో అమలుచేస్తున్న ఒక ప్రధాన కార్యక్రమందీనిని 2025 మే నుంచి వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోనుజియో వరల్డ్ గార్డెన్స్‌లోను నిర్వహించనున్నారువేవ్స్ మీడియావినోద (ఎం అండ్ పరిశ్రమలో చర్చలుసహకారంనవకల్పనలను ప్రోత్సహించే అగ్రగామి ప్రపంచ వేదికగా ఉందిఈ శిఖరాగ్ర సమావేశం పరిశ్రమ రంగ ప్రముఖులనుఆసక్తిదారులను ఒక చోటుకు తీసుకు వచ్చికొత్తగా ఎలాంటి ఎలాంటి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయో అన్వేషించడంతోపాటు సవాళ్లను పరిష్కరించడానికీప్రపంచంలో ఒక సృజనప్రధాన కూడలిగా భారత్ స్థానాన్ని పటిష్టపరచడానికీ తోడ్పడనుంది. 31 పోటీలలో 70,000కు పైచిలుకు నమోదులతోక్రియేట్ ఇన్ ఇండియా పోటీలు సృజనాత్మకతనూప్రతిభనూఅంతర్జాతీయ సహకారాన్నీ ప్రోత్సహించనుంది.

 

  5: Uniting Creators Worldwide

వేవ్స్ 2025లో భాగంగా ఒక కీలక కార్యక్రమంలా మొదలుపెట్టిన ‘రీల్ మేకింగ్’ సవాలు మీడియావినోద రంగాల్లో ఓ ప్రపంచ కూడలిగా భారత్ తెర మీదకు వస్తోందని సూచిస్తోందిఅదే కాలంలోడిజిటల్ రూపకర్తలు వారి వంతుగా ప్రధాన పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతుండడాన్ని తెలియజేస్తోందిఇది భారత్ ప్రభుత్వ ‘క్రియేట్ ఇన్ ఇండియా’ దృష్టికోణానికి సైతం అనుగుణంగా ఉంటూ దేశవ్యాప్తంగానూదేశం వెలుపలా కూడా ప్రతిభావంతులకు దన్నుగా నిలుస్తోంది.

ఈ సవాలు అఫ్గానిస్తాన్అల్బేనియాఅమెరికాఅండోరాఎంటిగువాబార్‌బుడాబంగ్లాదేశ్యూఏఈఆస్ట్రేలియాజర్మనీలు సహా అనేక దేశాల వారిని ఆకర్షించిందిఇది సృజనాత్మక రంగంలో భారత్ ప్రభావం నానాటికీ విస్తరిస్తూ ఉండడాన్నిప్రపంచమంతటా కంటెంట్‌ను రూపొందించే వారికి ఒక ప్రముఖ వేదికగా వేవ్స్‌కు ఆదరణ అధికం కావడాన్ని చాటిచెబుతోంది.

దేశీయంగా చూస్తేఈ పోటీకి ఎంట్రీలు తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), దీమాపుర్ (నాగాలాండ్), కార్గిల్ (లద్దాఖ్), లేహ్శోపియాన్ (కాశ్మీర్), పోర్ట్ బ్లేయర్ (అండమాన్నికోబార్ దీవులు), తేలియామురా (త్రిపుర), కాసర్‌గోడ్ (కేరళ)లతోపాటు గంగ్‌టోక్ (సిక్కిం) .. ఇలా దేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుంచిమారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి.  చిన్న చిన్న పట్టణాలుఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సృజనాత్మక కేంద్రాల నుంచి లభించిన బలమైన ప్రతిస్పందన మన దేశంలో సమృద్ధంగా ఉన్న కథన సంప్రదాయాలతోపాటు వర్ధిల్లుతూ ఉన్న డిజిటల్ అనుబంధ విస్తారిత వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.

వయసు కనీసం 20 ఏళ్లున్న పోటీదారులు ‘వికసిత్ భారత్’ వంటి ఇతివృత్తాలపై రీల్స్‌ను తయారు చేయాల్సి ఉంటుందివాటిలో మన దేశం సాంకేతికంగానుమౌలిక సదుపాయాల కల్పన పరంగాను సాధించిన పురోగతిని ప్రధానంగా వివరించాలిఅలాగేIndia @ 2047," (2047కల్లా భారత్అనే అంశాన్ని కూడా తీసుకోవచ్చుదీనిలో దేశ వృద్ధి రాబోయే కాలంలో ఏ విధంగా ఉండేదీ ఊహించి రీల్స్‌ను రూపొందించాల్సి ఉంటుందిఈ ఇతివృత్తాలు కథలను చెప్పే వారికి భారత నవకల్పన ప్రస్థానాన్ని వివరించడానికి ఒక వేదికను అందుబాటులోకి తీసుకువస్తాయివారు వారిలోని సృజనశీలత్వాన్నిదేశం సాధించే ప్రగతిని దృష్టాంతంగా చూపెట్టేందుకు రీల్స్ వేదికలవుతాయి.

ఇతివృత్తాలు

v. ఆహారం: వీధుల్లో దొరికే తిను బండారాలు మొదలు ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాల వరకుదేశంలోని సమృద్ధ పాకశాస్త్ర విశిష్టతలను గురించి ఘనంగా తెలియజేయండి

v. యాత్ర: మన దేశంలో మనోహర దృశ్యాలుగొప్ప స్థలాలుతెర మరుగున పడిపోయిన ప్రదేశాలను కళ్లకు కట్టండి.

v. ఫ్యాషన్: భారతీయ ష్యాషన్‌ రంగంలో సంప్రదాయఆధునికతల సమ్మేళనంపై దృష్టి సారించండి.

v. నృత్యసంగీతాలుశాస్త్రీయ ప్రదర్శనల మొదలు సమకాలీన రాగాల వరకూ భారతదేశ చైతన్యభరిత సంగీతాన్ని ఆవిష్కరించడంలో పాలుపంచుకోండి.

v. గేమింగ్భారత్‌లో పెరుగుతున్న గేమింగ్ సంస్కృతిపైనావినోద రంగంపైనా దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోండి.

v. యోగవెల్‌నెస్: యోగఆయుర్వేదవెల్‌నెస్ ప్రధాన అభ్యాసాల మాధ్యమాల అండదండలతో సంపూర్ణ జీవన సారాన్ని ప్రధానంగా చాటిచెప్పండి.

  v.  రహదారి యాత్రలు: భారతదేశంలో రహదారి యాత్రలుసుందర మార్గాలుయాత్రలో సాహసకృత్యాల్ని పంచుకోండి.

v. సాంకేతిక ప్రక్రియ: ఏఆర్వీఆర్‌లతోపాటు డిజిటల్ నవకల్పనలతో సృజనాత్మకతను రంగరించండిభవితకు రూపురేఖలనివ్వండి.

నిబంధనలు

రీల్స్‌కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు

పురస్కారాలుగుర్తింపుs & Recognition

 v. మెటా నిర్వహించే కార్యక్రమంతోపాటు మాస్టర్‌క్లాస్ 2025కుగాను ప్రత్యేక ఆహ్వానపత్రాన్నిస్తారు.

 v. వేవ్స్ ఈవెంట్‌లో పాల్గొనడానికి అయ్యే ఖర్చులన్నిటిని నిర్వాహకులు చెల్లిస్తారు.

 v. పోటీలో గెలిచిన రీల్స్‌ను వేవ్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోఆధికారిక వెబ్‌సైట్‌లోసామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తారు.

 v. తుది పోటీ దశకు చేరుకొన్న వారు గ్లోబల్ కంటెంట్ క్రియేటర్ పోటీల్లో పాల్గొనడానికి మంత్రిత్వ శాఖ మద్దతును ఇస్తుంది.

అదనపు సమాచారం కోసం:

https://wavesindia.org/challenges-2025

https://eventsites.iamai.in/Waves/reelmaking/

https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2099990

Click here to download PDF

 

***


(Release ID: 2102240) Visitor Counter : 29