ప్రధాన మంత్రి కార్యాలయం
సంగీతకారిణి చంద్రిక టండన్‌కు గ్రామీ పురస్కారం.. ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
03 FEB 2025 2:32PM by PIB Hyderabad
‘త్రివేణి’ ఆల్బమ్‌కు గ్రామీ పురస్కారాన్ని గెలుచుకొన్న సంగీతకారిణి చంద్రిక టండన్‌ను ప్రధానమంత్రి అభినందించారు. భారతీయ సంస్కృతి అంటే ఆమెకున్న మక్కువతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, దాతగా, సంగీతకారిణిగా ఆమె సాధించిన ఘనతలకు ప్రధాని ఆమెపై ప్రశంసలు కురిపించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘త్రివేణి ఆల్బమ్‌కు గ్రామీని గెలిచిన చంద్రిక టండన్ (@chandrikatandon) కు అభినందనలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, దాతగా, ఇంకా సంగీతకారిణిగా కూడా ఆమె సాధించిన ఘనతలు మనకు గర్వకారణమయ్యాయి. భారతీయ సంస్కృతి అంటే ఆమెకు అత్యంత ప్రేమాభిమానాలు ఉండడం ప్రశంసనీయం. మన దేశ సంస్కృతి అశేష ప్రజాదరణకు నోచుకొనే దిశలో ఆమె కృషిచేస్తున్నారు. అనేక మందికి ఆమె ప్రేరణమూర్తిగా నిలుస్తున్నారు.
న్యూయార్క్‌లో 2023లో ఆమెతో జరిపిన భేటీని నేను ఎంతో ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకొంటున్నాను.’’
***
MJPS/SR
(Release ID: 2099323)
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam