ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025ను గెలిచిన భారత్.. జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
02 FEB 2025 6:16PM by PIB Hyderabad
‘ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025’ను గెలిచిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘మన నారీ శక్తిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ‘ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025’లో విజయాన్ని సాధించినందుకు భారతీయ జట్టుకు అభినందనలు. ఈ గెలుపునకు ఉత్తమ టీంవర్క్, దృఢ సంకల్పంలతోపాటు ధైర్యం కూడా తోడ్పడింది.ఈ గెలుపు అనేక మంది వర్ధమాన క్రీడాకారిణులకు, క్రీడాకారులకు ప్రేరణనిస్తుంది. ఈ జట్టు భావి ప్రయత్నాల్లో కూడా రాణించాలని నేను ఆశిస్తూ, జట్టు సభ్యులకు నా శుభాకాంక్షలను అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2099050)
Visitor Counter : 21
Read this release in:
Marathi
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada