ఆర్థిక మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ కోసం బడ్జెట్ వ్యయం రూ. 67వేల కోట్లకు పెంపు
2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడగింపు
రానున్న మూడేళ్లలో 100శాతం కవరేజ్ సాధనే లక్ష్యం
Posted On:
01 FEB 2025 1:00PM by PIB Hyderabad
ఈరోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, జల్ జీవన్ మిషన్ కోసం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.67వేల కోట్లకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మిషన్‌ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
2019 నుంచి భారత గ్రామీణ జనాభాలో 80 శాతం ప్రాతినిధ్యం గల 15 కోట్ల కుటుంబాలు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రయోజనం పొందాయని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ మిషన్ కింద తాగునీటి కోసం కొళాయి నీటి కనెక్షన్లు అందిస్తున్నామనీ, రాబోయే మూడేళ్లలో 100 శాతం కవరేజీని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె వివరించారు.
పైపుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయు పథకాల మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై "జన్ భాగీధారి" ద్వారా జల్ జీవన్ మిషన్ దృష్టి సారిస్తుందన్నారు. సుస్థిర, పౌర కేంద్రీకృత నీటి సేవల పంపిణీని నిర్ధారించుటకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రత్యేక అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నట్లు శ్రీమతి సీతారామన్ తెలియజేశారు.
***
(Release ID: 2098755)
Visitor Counter : 41
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam