ఆర్థిక మంత్రిత్వ శాఖ
కొత్త పన్ను విధానంలో రూ. 12లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు
వేతనదారులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపి రూ. 12.75లక్షల వరకు పన్ను లేదు
పన్ను చెల్లింపుదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా ఆదాయపు పన్ను స్లాబ్‌లు, రేట్లలో విస్తృత మార్పులు ప్రవేశపెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్
పన్ను స్లాబ్ రేటు తగ్గింపు, రాయితీలతో మధ్యతరగతి వర్గాలకు గణనీయమైన పన్ను ఉపశమనం
పెరగనున్న గృహ వినియోగ వ్యయం, పెట్టుబడులు
Posted On:
01 FEB 2025 1:28PM by PIB Hyderabad
"ముందు నమ్మండి, తరువాత పరిశీలించండి" అనే తత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, 2025-26 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతిపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది అలాగే సాధారణ పన్ను చెల్లింపుదారుకు పన్ను భారం నుంచి భారీ ఉపశమనం కల్పించింది. ఈరోజు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా స్లాబ్‌లు, రేట్లలో గణనీయమైన మార్పులను ప్రతిపాదించారు.
పన్ను చెల్లింపుదారులకు శుభవార్తను చెబుతూ ఆర్థిక మంత్రి ఇలా అన్నారు, “కొత్త విధానంలో రూ. 12 లక్షల ఆదాయం వరకు (అంటే మూలధన లాభాల వంటి ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా నెలకు సగటున రూ. 1 లక్ష ఆదాయం వరకు) ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 75వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపి పన్ను చెల్లించే వేతనదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలుగా ఉంటుంది." స్లాబ్ రేటు తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనంతో పాటు, వారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని విధంగా పన్ను రాయితీని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
"కొత్త పన్ను విధానం మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అలాగే వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది, తద్వారా వారి గృహ వినియోగం, పొదుపులు, పెట్టుబడులను పెంచుతుంది" అని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.
కొత్త పన్ను విధానంలో, పన్ను రేటు నిర్మాణాన్ని కింది విధంగా సవరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు:
0-4 లక్షల రూపాయలు
|
ఎలాంటి పన్ను లేదు
|
4-8 లక్షల రూపాయలు
|
5 శాతం
|
8-12 లక్షల రూపాయలు
|
10 శాతం
|
12-16 లక్షల రూపాయలు
|
15 శాతం
|
16-20 లక్షల రూపాయలు
|
20 శాతం
|
20- 24 లక్షల రూపాయలు
|
25 శాతం
|
24 లక్షల రూపాయల కంటే ఎక్కువ
|
30 శాతం
|
వివిధ ఆదాయ స్థాయిల్లో స్లాబ్ రేటు మార్పులు, రాయితీలతో మొత్తం పన్ను ప్రయోజనాన్ని కింది పట్టికలో చూడవచ్చు:
వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకునేందుకు పన్నుల సంస్కరణలను కీలకమైన సంస్కరణల్లో ఒకటిగా అభివర్ణించిన శ్రీమతి సీతారామన్, కొత్త ఆదాయపు పన్ను బిల్లు 'న్యాయ' స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతుందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు, పన్ను విధించేవారికి కొత్త విధానం అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందని, అందువల్ల పన్ను కచ్చితత్వం పెరిగి, వివాదాలు తగ్గుతాయని ఆమె తెలియజేశారు.
"సమస్త జీవులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నట్లే, పౌరులు మంచి పాలన కోసం ఎదురు చూస్తున్నారు" అంటూ తిరుక్కురల్‌లోని 542వ శ్లోకాన్ని ఆర్థికమంత్రి ఉటంకించారు. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు మంచి పాలనను అందించేందుకు సంస్కరణలే మంచి మార్గమన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం మన పౌరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి అలాగే వాటిని పరిష్కరించడానికి తీసుకున్న చర్యలను ఈ పన్ను ప్రతిపాదనలు వివరిస్తున్నాయని శ్రీమతి సీతారామన్ అన్నారు.
***
(Release ID: 2098460)
Visitor Counter : 109
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam