ప్రధాన మంత్రి కార్యాలయం
చరిత్రాత్మక వందో ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రోకు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
29 JAN 2025 6:57PM by PIB Hyderabad
చరిత్రాత్మక 100వ ప్రయోగాన్ని నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల దార్శనికత, అంకితభావం, నిబద్ధతకు అద్దం పట్టే అద్భుతమైన విజయమని అభివర్ణించారు.
భారత అంతరిక్ష ప్రస్థానంలో ప్రైవేటు రంగం పాత్ర పెరుగుతుండడాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. అంతరిక్ష పరిశోధనలో విజయాలను కొనసాగిస్తూ, దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“చరిత్రాత్మక 100వ ప్రయోగాన్ని నిర్వహించిన @isroకు అభినందనలు.
ఈ అద్భుత విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల దార్శనికత, అంకితభావం, నిబద్ధతలకు అద్దం పడుతోంది.
ప్రైవేటు రంగం చేతులు కలుపుతున్న వేళ భారతదేశ అంతరిక్ష ప్రస్థానం తప్పక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.”
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2097523)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam