ప్రధాన మంత్రి కార్యాలయం
‘మిషన్ స్కాట్’ విజయంపై భారత అంతరిక్ష అంకుర సంస్థ ‘దిగంతర’కు ప్రధాని ప్రశంస
प्रविष्टि तिथि:
17 JAN 2025 11:14PM by PIB Hyderabad
భారత అంతరిక్ష అంకుర సంస్థ ‘దిగంతర’ చేపట్టిన ‘మిషన్ స్కాట్’ ప్రయోగం విజయం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతరిక్ష స్థితిగతులపై అవగాహన పెంపు దిశగా సాగుతున్న కృషిలో భారత అంతరిక్ష పరిశ్రమ పోషిస్తున్న కీలక పాత్రకు ఇది నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
‘దిగంతర’ సంస్థ తన విజయంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంపై శ్రీ మోదీ స్పందిస్తూ:
“మిషన్ స్కాట్ప్రయోగ విజయంపై భారత అంతరిక్ష అంకుర సంస్థ ‘దిగంతర’కు అభినందనలు. అంతరిక్ష స్థితిగతులపై అవగాహన పెంచే దిశగా సాగుతున్న కృషిలో భారత అంతరిక్ష పరిశ్రమ పోషిస్తున్న కీలక పాత్రకు ఈ విజయం ఒక ఉదాహరణ” అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2096013)
आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam