ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపుర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 21 JAN 2025 8:41AM by PIB Hyderabad

త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతి విషయంలో గుర్తుంచుకోదగ్గ తోడ్పాటును త్రిపుర అందిస్తోందంటూ ఆయన ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు:
‘‘త్రిపుర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం దేశ పురోగతికి గుర్తుంచుకోదగ్గ తోడ్పాటును అందిస్తోంది.  సంపన్న సంస్కృతికి, సంప్రదాయానికి కూడా ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. అభివృద్ధిలో సరికొత్త శిఖర స్థాయిలను త్రిపుర అందుకోవాలి అని నేను కోరుకుంటున్నాను.’’

 

 

***

MJPS/SR


(Release ID: 2094762) Visitor Counter : 12