ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖో ఖో ప్రపంచ కప్ విజయంపై భారత మహిళల జట్టుకు ప్రధాని అభినందన

Posted On: 19 JAN 2025 9:20PM by PIB Hyderabad

తొలిసారిగా ఖో ఖో ప్రపంచ కప్ ను గెలుచుకున్న భారత మహిళల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

“తొలిసారిగా ఖో ఖో ప్రపంచ కప్ గెలుచుకున్న భారత మహిళల జట్టుకు అభినందనలు. వారి అద్వితీయ నైపుణ్యం, దృఢ సంకల్పం, సమష్టి కృషి ఫలితం ఈ చారిత్రక విజయం.

ఈ విజయం భారత అత్యంత పురాతన సాంప్రదాయక క్రీడల్లో ఒకటైన ఖో ఖో వైపు మరింతగా అందరి దృష్టినీ మరల్చింది. దేశవ్యాప్తంగా అనేకమంది యువ క్రీడాకారులకు ఇది స్ఫూర్తిదాయకం. మున్ముందు మరింత మంది యువత ఈ క్రీడను కొనసాగించేలా ఈ విజయం మార్గం సుగమం చేసింది.” 

 

 

***

MJPS/SR


(Release ID: 2094487) Visitor Counter : 10