ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 19 JAN 2025 11:05PM by PIB Hyderabad

ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. వారి అకుంఠిత దీక్ష, అంకిత భావం ప్రశంసనీయమైనవని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

“భారత ఖో ఖో క్రీడకు నేడు చిరస్మరణీయమైన దినం.

భారత పురుషుల ఖో ఖో జట్టు ప్రపంచకప్ గెలవడం అత్యంత గర్వకారణమైన విషయం. వారి దక్షత, అంకిత భావం ప్రశంసనీయం. యువతలో ఖోఖోను మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి ఈ విజయం దోహదపడుతుంది.”

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2094486) आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam