ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిడే ఉమెన్స్ వరల్డ్ రాపిడ్ ఛాంపియన్ షిప్ విజయంపై కోనేరు హంపికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
29 DEC 2024 3:34PM by PIB Hyderabad
ఫిడే ఉమెన్స్ వరల్డ్ రాపిడ్ చాంపియన్ షిప్-2024 లో విజయం సాధించిన కోనేరు హంపికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె స్థైర్యం, చాతుర్యం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ ఆయన ఇలా పేర్కొన్నారు:
“ఫిడే ఉమెన్స్ వరల్డ్ రాపిడ్ చాంపియన్ షిప్-2024లో విజయం సాధించిన @humpy_koneruకు శుభాకాంక్షలు. ఆమె స్థైర్యం, చాతుర్యం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
ఇది ఆమె సాధించిన రెండో వరల్డ్ రాపిడ్ చాంపియన్ షిప్ టైటిల్ కావడం మరింత విశేషమైనది. తద్వారా, ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక భారతీయురాలిగా ఆమె నిలిచారు.”
***
MJPS/SR
(Release ID: 2088778)
Visitor Counter : 37
Read this release in:
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati