ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబరు 23న న్యూ ఢిల్లీలో సీబీసీఐ సెంటర్‌లో కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రిస్‌మస్ వేడుకలు: హాజరుకానున్న ప్రధానమంత్రి

కార్డినల్స్, బిషప్‌లు సహా క్రైస్తవ సమాజ ప్రముఖ నేతలతో ప్రధాని మాటామంతీ


భారతదేశంలో కేథలిక్ చర్చి ప్రధానకేంద్రంలో ఈ తరహా కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడం ఇదే మొదటిసారి

प्रविष्टि तिथि: 22 DEC 2024 2:39PM by PIB Hyderabad

కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఆధ్వర్యంలో డిసెంబరు 23న సాయత్రం ఆరున్నర గంటలకు న్యూ ఢిల్లీలో సీబీసీఐ సెంటర్‌లో నిర్వహించనున్న క్రిస్‌మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

క్రైస్తవ సమాజానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రధాని మాట్లాడనున్నారు. వీరిలో కార్డినల్స్, బిషప్స్‌తో పాటు చర్చికి చెందిన ప్రముఖ నేతలు కూడా ఉంటారు.

భారతదేశంలో కేథలిక్ చర్చి ప్రధానకేంద్రంలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటుండడం ఇది మొదటిసారి.

కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ)ని 1944లో స్థాపించారు. ఈ సంస్థ భారతదేశమంతటా కేథలిక్‌లందరితో కలిసి పనిచేస్తోంది.

 


(रिलीज़ आईडी: 2087103) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam