ప్రధాన మంత్రి కార్యాలయం
కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో ప్రధానమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
04 DEC 2024 8:39PM by PIB Hyderabad
కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో భేటీ అయినందుకు సంతోషంగా ఉంది. భారతీయ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక చర్యలను తీసుకొంటున్నందుకు కువైట్ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండు ప్రాంతాల ప్రయోజనాల పరిరక్షణకు మన రెండు దేశాల ప్రగాఢ, చరిత్రాత్మక సంబంధాలను ముందుకు తీసుకుపోవడానికి భారత్ కట్టుబడి ఉంది’’.
****
MJPS/SR
(रिलीज़ आईडी: 2080945)
आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam