ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ లో శి యోమీ జిల్లాలో 186 ఎమ్‌డబ్ల్యూ సామర్థ్యం ఉండే తాతో-I జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం;


పెట్టుబడి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర;

రూ. 1750 కోట్ల ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 50 నెలల గడువు

Posted On: 25 NOV 2024 8:50PM by PIB Hyderabad

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని శి యోమీ జిల్లాలో హియో జల విద్యుత్తు ప్రాజెక్టు (హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు..హెచ్‌ఈపీ)ని నిర్మించడానికి రూ. 1750 కోట్లు పెట్టుబడిని పెట్టడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదాన్ని తెలిపింది.  ఈ ప్రాజెక్టు 50 నెలల్లో పూర్తి కావచ్చని భావిస్తున్నారు.

ఒక్కొక్కటీ 62 మెగా వాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లు (3 x 62 ఎమ్ డబ్ల్యూ) భాగంగా ఉండే ఈ ప్రాజెక్టు 802 మిలియన్ యూనిట్ల (ఎమ్‌యూ) విద్యుత్ ను  ఉత్పత్తి చేయనుంది.  ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా స్థితిని మెరుగుపరచడంలో తోడ్పడడంతో పాటు జాతీయ గ్రిడ్‌ నిలవకు కూడా సాయపడనుంది.

ఈ ప్రాజెక్టును అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీఓ) కలిసి ఏర్పాటు చేసే సంయుక్త సంస్థ ద్వారా అమలు చేయనున్నారు.  దీనిలో భాగంగా రహదారులను, వంతెనలను, విద్యుత్తు ప్రసార మార్గానికి కావలసిన ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ.77.37 కోట్ల నిధులను బడ్జెటు నుంచి కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది.  అంతేకాకుండా రాష్ట్ర వాటా మూలధనం రూపంలో రూ.120.43 కోట్ల కేంద్రీయ ఆర్థిక సహాయాన్ని కూడా అందించనుంది.

రాష్ట్రానికి 12 శాతం ఉచిత విద్యుత్తు లభించడమే కాక లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ (ఎల్ఏడీఎఫ్)కు మరో 1 శాతం లాభం కూడా సమకూరనుంది.  దీనికి అదనంగా, ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయ. సామాజికంగా, ఆర్థికంగా ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించనుంది.

ఈ ప్రాజెక్టు కు అవసరమైన సుమారు 10 కిలోమీటర్ల రహదారులు, వంతెనలు సహా మౌలిక సదుపాయాల కల్పన చెప్పుకోదగిన విధంగా మెరుగవనుంది. ఈ సౌకర్యాలను స్థానికంగా వినియోగించుకొంటారు.  ప్రాజెక్టు నిధుల నుంచి ఆసుపత్రులు, పాఠశాలలు, ఐటిఐ ల వంటి వృత్తివిద్య సంబంధ శిక్షణ సంస్థలు, బజారులు, ఆటమైదానాలు వగైరా అత్యవసర ప్రాథమిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకు రావడానికి రూ.15 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనుండడం వల్ల కూడా జిల్లా కు మేలు కలగనుంది. ఇక స్థానికులు అనేక రకాల నష్టపరిహారాలను అందుకోవడమే కాక ఉపాధిని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ ఆర్) ప్రధాన కార్యక్రమాల రూపేణా కూడా లాభపడనున్నారు.

 

****


(Release ID: 2077517) Visitor Counter : 70