ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డొమినికా ప్రధానమంత్రిని కలిసిన భారత ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 21 NOV 2024 10:29PM by PIB Hyderabad

భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గయానాలోని జార్జ్ టౌన్‌లో డొమినికా ప్రధానమంత్రి శ్రీ రూజ్‌వెల్ట్ స్కెరిట్‌తో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

వాతావరణ మార్పుల నుంచి రక్షణ, సాంకేతికత దిశగా పరివర్తన, విద్య, ఆరోగ్య సంరక్షణ, సామర్థ్యాభివృద్ధి, యోగా వంటి రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలను వారు చర్చించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. 


(रिलीज़ आईडी: 2076352) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada