ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 NOV 2024 9:15AM by PIB Hyderabad

భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియేఅంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారుప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారుమన వారసత్వంజాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పోస్టు చేశారు:

‘‘మన ప్రవాస భారతీయులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందాం!

భారత్ కో జానియే క్విజ్ లో పాల్గొనాల్సిందిగా విదేశాల్లో ఉన్న భారతీయులనూస్నేహితులనూ కోరుతున్నాను’’.

#BharatKoJaniye Quiz!

bkjquiz.com

ఇన్ క్రెడిబుల్ ఇండియాకి చెందిన అనేక అద్భుతాలను వీక్షించే అవకాశాన్ని ఈ క్విజ్ విజేతలకు కల్పిస్తారు.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2076214) आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Bengali , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam