ప్రధాన మంత్రి కార్యాలయం
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
19 NOV 2024 8:41AM by PIB Hyderabad
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు. భయమంటే ఏమిటో ఎరుగని ఆమె, ధైర్యానికీ, సాహసానికీ, దేశభక్తికీ నిజమైన ప్రతీకగా నిలిచారంటూ ప్రధాని ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘భయం అంటే ఏమిటో ఎరుగని ఝాన్సీ రాణి లక్ష్మీ బాయికి ఆమె జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆమె ధైర్యసాహసాలకు, దేశభక్తికి నిజమైన ప్రతీకగా నిలిచారు. స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో రాణి లక్ష్మీబాయి చూపిన శౌర్యమూ, చేసిన కృషీ తరాల తరబడీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ప్రతికూల పరిస్థితులలో ఆమె ప్రదర్శించిన నాయకత్వ పటిమ అసలైన దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది’’
***
MJPS/SR
(Release ID: 2074588)
Visitor Counter : 18
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam