ప్రధాన మంత్రి కార్యాలయం
నైజీరియాలో మరాఠీ సముదాయం తమ సంస్కృతి, మూలాలతో అనుబంధాన్ని పెనవేసుకొని ఉంటున్నందుకు వారికి ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
17 NOV 2024 6:05AM by PIB Hyderabad
నైజీరియాలో నివసిస్తున్న మరాఠీ సముదాయం తమ సంస్కృతిని, తమ మూలాలను మరచిపోకుండా వాటిని అనుసరిస్తూ ఉంటున్నందుకు గాను వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజున ప్రశంసించారు. మరాఠీ భాషకు ఒక శాస్త్రీయ భాష హోదాను ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా ప్రధాని ఈ విధంగా ప్రతిస్పందించారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘మరాఠీ భాషకు శాస్త్రీయ భాష హోదాను కట్టబెట్టిన సందర్భంగా, నైజీరియా లోని మరాఠీ సముదాయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. వారి సంస్కృతి అన్నా, వారి మూలాలన్నా వారు ఎంతగా అనుబంధాన్ని పెంచుకొన్నారో గమనిస్తే, అది నిజంగా ప్రశంసనీయంగా ఉంది.’’
***
MJPS/SR
(Release ID: 2074137)
Visitor Counter : 17
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam