ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధానమంత్రి మోదీని కలిసిన రష్యా తొలి డిప్యూటీ ప్రధానమంత్రి డేనిస్ మంతురోవ్


వాణిజ్య, ఆర్థిక సంబంధాలు.. ఇంధనం, అనుసంధానతలో సహకారాన్ని మెరుగుపరుచుకోవడంపై చర్చలు

ఇటీవలి రష్యా పర్యటన.. మాస్కో, కజన్ లలో అధ్యక్షుడు పుతిన్ తో సమావేశాల

సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు ప్రయత్నాలను స్వాగతించిన భారత ప్రధానమంత్రి

అధ్యక్షుడు పుతిన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 NOV 2024 8:55PM by PIB Hyderabad

రష్యన్ ఫెడరేషన్ తొలి ఉప ప్రధానమంత్రి హెచ్.డేనిస్ మంతురోవ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

వాణిజ్యఆర్థిక సంబంధాలుఇంధనంఅనుసంధానం సహా పలు రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై వారు చర్చించారు.

ఇటీవలి తన రష్యా పర్యటనఅధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు కోసం.. భారత్ – రష్యా ప్రత్యేకవిశిష్ట వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు బృందాలు చేస్తున్న నిరంతరసమష్టి కృషిని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు.

అధ్యక్షుడు పుతిన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ.. ఆయనతో చర్చల కొనసాగింపు కోసం ఎదురుచూసినట్లుగా పేర్కొన్నారు

 

***


(रिलीज़ आईडी: 2072588) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam