ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ ఆర్థిక నిపుణుడు, ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ బిబేక్ దేబ్ రాయ్ మృతికి ప్రధాన మంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 01 NOV 2024 11:09AM by PIB Hyderabad

భారతీయ ఆర్థిక నిపుణుడు, ఆర్థిక అంశాలలో ప్రధాన మంత్రికి సలహాలిచ్చే మండలికి అధ్యక్షుడు డాక్టర్ బిబేక్ దేబ్ రాయ్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశంలో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:


‘‘డాక్టర్ బిబేక్ దేబ్ రాయ్ జీ ఒక సమున్నత పండితుడు; ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మిక రంగం వంటి అనేక విభిన్న రంగాల్లో ఆయనది అందె వేసిన చేయి.  ఆయన చేసిన కృషి దేశంలో మేధోజగతిపై అమిత ప్రభావాన్ని చూపించింది.  ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఆయన అందించిన సేవలను మించి  మన ప్రాచీన గ్రంథాల పట్ల ఎంతో మక్కువతో కృషి చేసి, ఆ గ్రంథాల సారాంశం మన యువతరానికి అర్థమయ్యేటట్లుగా వాటిని తీర్చిదిద్దారు.’’

 

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2070055) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam