ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త శ్రీ టి.పి.జి.నంబియార్ మృతిపట్ల ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
31 OCT 2024 7:27PM by PIB Hyderabad
ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త శ్రీ టి.పి.జి.నంబియార్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ టిపిజి నంబియార్ భారత దేశాన్ని ఆర్థికంగా బలంగా మార్చే దిశగా ఎల్లప్పుడూ కృషి చేసిన దృఢమైన వ్యక్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘‘టీపీజీ నంబియార్ ఒక మార్గదర్శక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. భారతదేశం ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆకాంక్షతో ఆ దిశగా కృషి చేశారు. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2069920)
आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam