ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపాధి స‌మ్మేళ‌నంలో 51,000 మందికిపైగా అభ్య‌ర్థుల‌కు నియామ‌క‌ప‌త్రాల పంపిణీ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

Posted On: 29 OCT 2024 2:11PM by PIB Hyderabad

అంద‌రికీ న‌మ‌స్కారం!

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మంత్రిమండలి సహచరులుఎంపీలుఎమ్మెల్యేలుదేశవ్యాప్తంగాగల యువ మిత్రులుసోదరసోదరీమణులారా!

ఈ రోజు ధ‌న్‌తేర‌స్ ప‌ర్వ‌దినం... ఈ సందర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుదీంతోపాటు దీపావళి వేడుకలు కూడా చేసుకోబోతున్నాంఈ ఏడాది పండుగ మనకు అత్యంత ప్రత్యేకంఏటా చేసుకునే వేడుకలే కదా... ఈసారి దీపావళికి అంత ప్రత్యేకత ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చుఆ వైశిష్ట్యం ఏమిటంటే- శ్రీరాముడు (రామ్ లల్లా-బాల రాముడుఅర్ధ శతాబ్దం (500 ఏళ్లతర్వాత ఈ ఏడాదిలోనే అయోధ్యలోని తన అద్భుత ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడుఆ బాల రాముని ప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపావళిఎన్నో తరాలు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశాకలక్షలాదిగా ప్రజల త్యాగాలుకష్టాల అనంతరం ఆవిష్కృతమైన మధుర క్షణమిదిఅంతటి అత్యద్భుతఅసాధారణ దీపావళి వేడుకలకు  ప్రత్యక్ష సాక్షులం కావడం నిజంగా మన సుకృతం.

ఈ వేడుకల నడుమఇంతటి పవిత్ర దినాన నేటి ఉపాధి సమ్మేళనంలో 51,000 మంది యువత ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.. శుభాకాంక్షలు.

మిత్రులారా!

దేశంలోని లక్షలాది యువతకు శాశ్వత ప్రభుత్వోద్యోగ కల్పన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోందిబీజేపీ, ‘ఎన్‌డిఎ’ పాలనలోగల రాష్ట్రాల్లోనూ లక్షలాది యువతకు నియామక పత్రాలు జారీ చేశారుఇందులో భాగంగా హర్యానాలో ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తక్షణమే 26,000 మందికి ఉపాధి కానుక ఇచ్చిందిఅంబరాన్నంటిన ఆనందంతో యువత సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలను ఆ రాష్ట్రం గురించి తెలిసిన వారు సులువుగా ఊహించుకోగలరుహర్యానాలోని మా పార్టీ ప్రభుత్వం ఒక విశిష్ట విధానాన్ని అనుసరిస్తోందిఅక్కడ ఉపాధి కల్పనలో ఎలాంటి వ్యయప్రయాసలులంచగొండి లావాదేవీలకు తావుండదుఈ నేపథ్యంలో 26,000 మంది హర్యానా యువతకు ఈ వేదిక నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానుదీనికి అదనంగా ఈ రోజు 51 వేల మందికి నియామక పత్రాల జారీతో ఉపాధి కల్పనలో మనం గణనీయ ప్రగతి సాధించడం హర్షణీయం.

మిత్రులారా!

దేశ యువతకు గరిష్ఠ స్థాయిలో ఉపాధి కల్పన మా బాధ్యతప్రభుత్వ విధానాలునిర్ణయాలు ఉపాధి కల్పనను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయిఈ నేపథ్యంలో నేడు  దేశమంతటా ఎక్స్‌ ప్రెస్‌వేలు, హైవేలురోడ్లురైల్వేలుఓడరేవులువిమానాశ్రయాలుఫైబర్ లైన్లుమొబైల్ టవర్ల ఏర్పాటు వంటి ఎన్నో ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయిదేశం నలుమూలలా కొత్త పరిశ్రమల విస్తరణకు బాటలు వేస్తున్నాంకొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణం సహా నీటిసరఫరాగ్యాస్ పైప్‌లైన్లు విస్తృతంగా వేస్తున్నాంపాఠశాలలుకళాశాలలువిశ్వవిద్యాలయాలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయిముఖ్యంగా మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల ద్వారా రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యందీనిక అనుగుణంగా కొనసాగే ఈ కార్యక్రమాలు పౌరులకు మెరుగైన సౌకర్యాలతోపాటు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తున్నాయి.

మిత్రులారా!

నిన్నటి నా వడోదర పర్యటనలో భాగంగా అక్కడ రక్షణ రంగ రవాణా విమానాల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించిందిఈ ఒక్క ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి లభించడం మాత్రమే కాదు... విమానాల ఉత్పత్తికి విడిభాగాల అవసరం విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఇది గణనీయ సంఖ్యలో అదనపు ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుందిఈ విడి భాగాల తయారీసరఫరా కోసం అనేక చిన్న కర్మాగారాల నెట్‌వర్క్ ఏర్పడుతుందిఇందులో దేశంలోని సూక్ష్మ-లఘు-మధ్యతరహా (ఎంఎస్ఎంఇపరిశ్రమలు అంతర్భాగమవుతాయిదీంతోపాటు డిమాండుకు అనుగుణంగా కొత్త ‘ఎంఎస్ఎంఇ’లు కూడా ఏర్పాటు కాగలవుఒక విమానం తయారీకి 15,000 నుంచి 25,000 దాకా చిన్నాపెద్దా విడిభాగాలు అవసరం కాబట్టివాటిని తయారుచేసే ప్రతి కర్మాగారానికీ సరఫరాల కోసం వేలాది ఇతర ఫ్యాక్టరీల్లోనూ ఉత్పత్తి కార్యకలాపాలు ఊపందుకుంటాయిఈ విధంగా మన ‘ఎంఎస్ఎంఇ’ రంగానికి గణనీయ ప్రోత్సాహం లభించడంతోపాటు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాల సృష్టికి వీలుంటుందనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

ఈ రోజున ఒక పథకానికి శ్రీకారం చుడుతున్నామంటేదానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలకు మాత్రమే మా దృష్టి పరిమితం కాదుదాని ప్రభావం మరింత విస్తృతం కావాలన్నది మా ధ్యేయంకొత్త ఉపాధి అవకాశాలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం. ‘ప్రధానమంత్రి సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం ఇందుకు ఒక ఉదాహరణసాధారణ దృష్టితో చూస్తే ఇది ఉచిత గృహవిద్యుత్ సరఫరాకు ఉద్దేశించినదిగా కనిపించవచ్చుగానీలోతుగా పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయిగడచిన ఆరు నెలల్లోనే దాదాపు 1.25 కోట్ల నుంచి 1.50 కోట్ల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారువీరి ఇళ్లకు అవసరమైన వ్యవస్థల ఏర్పాటు కోసం 9,000 మంది విక్రేతలు ముందుకొచ్చారుఇప్పటికే లక్షలకుపైగా ఇళ్ల పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చారుమరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల 800 గ్రామాలను సౌర విద్యుత్ ఆధారిత ఆదర్శ గ్రామాలుగా రూపొందించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయిదీనికి తగినట్లు సౌర విద్యుత్ వ్యవస్థ అమర్చే పనిలో 30,000 మంది శిక్షణ పొందారుమొత్తంమీద ఈ ఒక్క పథకమే తయారీదారులువిక్రేతలుఅమర్చేవారుమరమ్మతుదారుల రూపంలో లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేసింది.

మిత్రులారా!

ఇప్పుడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాం... ఇందులో భాగంగా చిన్న గ్రామాల గురించి మొదట వివరిస్తానుదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ ఖాదీ ఒక చర్చనీయాంశంగా ఉందిఅయితేనేడు ఖాదీ-గ్రామీణ పరిశ్రమలో వచ్చిన అద్భుత ప్రగతిశీల మార్పులను గమనించండిగడచిన 10 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వ విధానాలు ఈ పరిశ్రమను సంపూర్ణంగా పునరుద్ధరించాయిదీనివల్ల పరిశ్రమ ప్రతిష్ఠ ఇనుమడించడమేగాక ఇందులో అంతర్భాగమైన గ్రామీణుల ఆర్థిక స్థితిగతులు కూడా ఎంతో మెరుగుపడ్డాయిఖాదీ-గ్రామీణ పరిశ్రమ నేడు ఏటా రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం ఆర్జిస్తోందిమునుపటి-ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల గణాంకాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో దశాబ్దం కిందటి పరిస్థితితో పోలిస్తేఆశ్చర్యకర వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందిఈ మేరకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఖాదీ విక్రయాలు ‘యుపిఎ’ ప్రభుత్వ కాలంకన్నా 400 శాతం ఎక్కువగా నమోదయ్యాయిదీన్నిబట్టి చేతివృత్తులవారుచేనేత కార్మికులువ్యాపారులు గణనీయ లబ్ధి పొందుతున్నారన్నది స్పష్టమవుతోందిఅలాగే ఈ రంగంలో కొత్త అవకాశాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా అందివస్తాయి.

ఇదే తరహాలో మన గ్రామీణ మహిళల ఉపాధి-స్వయం ఉపాధికి ‘లక్షాధికారి సోదరి’ పథకం కొత్త బాటలు వేసిందిగడచిన దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరివివిధ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావడమే కాకుండా తమ కృషితో ఆదాయార్జన కూడా చేస్తున్నారువీరంతా నేడు ఉపాధి-స్వయం ఉపాధి మార్గాల్లో కుటుంబ సంపాదనకు తమ ఆర్జనను జోడిస్తుండటం అభినందనీయంపది కోట్లు అంటే పెద్ద సంఖ్యే అయినాఆ మహిళలు సాధించిన ప్రగతిని చాలామంది గమనించకపోవచ్చుకానీప్రభుత్వం వారికి పూర్తి చేయూతనిస్తూ అవసరమైన వనరులుఆర్థిక సహాయం సమకూర్చిందిదీంతో వివిధ రకాల ఉపాధి మార్గాల్లో వారంతా ఆదాయార్జన చేస్తున్నారుఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్ల మంది మహిళలను ‘‘లక్షాధికారి సోదరీమణులు’’గా మార్చాలని మా ప్రభుత్వం లక్ష్య నిర్దేశం చేసుకుందితదనుగుణంగా ఆదాయ సృష్టికి మాత్రమే పరిమితం కాకుండా దాన్ని మరింత పెంచడమే ధ్యేయంగా పెట్టుకుందిదీంతో ఇప్పటిదాకా దాదాపు 1.25 కోట్ల మంది ఈ లక్ష్యాన్ని అధిగమించగావారి వార్షికాదాయం నేడు లక్ష రూపాయలు దాటింది.

మిత్రులారా!

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే లక్ష్యంతో మన దేశం నేడు దూసుకెళ్తోందిఇదంతా చూస్తున్న మన యువతరంలో ఇంతకుముందు ఇంత వేగంగాభారీగా అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదన్న సందేహం తలెత్తడం సహజంగత ప్రభుత్వాలకు సంకల్పంవిధానాలు... రెండూ లేకపోవడమే ఇందుకు కారణమని ఒక్కముక్కలో జవాబు చెప్పవచ్చు.

మిత్రులారా!

మన దేశం అనేక రంగాల్లో... ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత వెనుకబడిందో మీకు గుర్తుండే ఉంటుందిప్రపంచంలో పుట్టుకొచ్చే కొత్త సాంకేతికత కోసం భారత్ ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదిమనదాకా వచ్చేసరికి పాశ్చాత్య దేశాల్లో అది పాతబడిపోయేదిపైగా మన దేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి అసాధ్యమనే అపోహ ఒక ధోరణిగా మారిపోయిందిఈ దురవగాహన మన పురోగతిని విపరీతంగా దెబ్బతీసిందిదీంతో ఆధునిక అభివృద్ధి పరుగు పందెంలో వెనుకబడటమేగాక ఉపాధి వనరులను కూడా గణనీయంగా కోల్పోయిందిఉపాధి కల్పించగల ఆధునిక పరిశ్రమలు లేనిదే ఉద్యోగ సృష్టి సాధ్యమాఅందుకే గత ప్రభుత్వాల కాలం చెల్లిన ఆలోచన ధోరణి నుంచి దేశాన్ని విముక్తం చేస్తూ మా కృషికి శ్రీకారం చుట్టాంతదనుగుణంగా అంతరిక్ష రంగం నుంచి సెమీకండక్టర్ల వరకు... ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల దాకా... ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞాన పరిధిలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని అమలు చేశాంతద్వారా స్వయం సమృద్ధ భారత్ లక్ష్య సాధనకు కృషి చేశాంకొత్త సాంకేతిక పరిజ్ఞానాలతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా ‘ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక (పిఎల్ఐపథకం’ ప్రారంభించాంఈ రెండు కార్యక్రమాలతో ఉపాధి అవకాశాల సృష్టి అనూహ్య స్థాయిలో వేగం పుంజుకుందిదేశవ్యాప్తంగా నేడు ప్రతి రంగంలోనూ పరిశ్రమల సంఖ్య పెరుగుతూ యువతకు కొత్త అవకాశాలు అందివస్తున్నాయిపెద్దఎత్తున పెట్టుబడుల రాకతోపాటు అవకాశాల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తోందిదేశంలో గత ఎనిమిదేళ్లలో 1.5 లక్షలకుపైగా అంకుర సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణంగా మారిందిఈ పరిణామాల ఫలితంగా ముందడుగు వేసే అవకాశాలు కలిసి రావడంతో మన యువత ఉపాధి పొందుతున్నారు.

మిత్రులారా!

దేశ యువత శక్తిసామర్థ్యాలను పెంచే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిపై నిశితంగా దృష్టి సారించిన ప్రభుత్వం ‘నైపుణ్య భారత్’ (స్కిల్ ఇండియావంటి కార్యక్రమాలను  ప్రారంభించిందిదీనికింద దేశవ్యాప్తంగా వందలాది నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువత శిక్షణ పొందుతున్నారుఅటుపైన అనుభవంఅవకాశాల కోసం అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి లేదన్న భరోసా యువతలో కల్పించాంఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌ షిప్ యోజన’ కింద దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలలో నెలకు రూ.5,000 వంతున భృతితో ఏడాదిపాటు అనుభవ శిక్షణ పొందగలిగేలా నిబంధనలు రూపొందించాంఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువత ప్రయోజనం పొందాలన్నది మా లక్ష్యంఈ అమూల్య అనుభవ శిక్షణ వివిధ రంగాల్లో వాస్తవ ప్రపంచ వ్యాపార వాతావరణంతో యువతను అనుసంధానించివారి భవితను తీర్చిదిద్దగలదు.

మిత్రులారా!

   మన యువతరం విదేశాల్లో మరింత సులువుగా ఉద్యోగాలు పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం కొత్త అవకాశాలు కల్పిస్తోందిభారత్ కోసం జర్మనీ ‘‘నిపుణ కార్మికశక్తి వ్యూహం’’ పేరిట ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకటించడాన్ని ఇటీవల మీరు పత్రికలలో చూసే ఉంటారుభారత్ నుంచి తమ దేశానికి వచ్చే నిపుణ యువతరం కోసం జర్మనీ గతంలో ఏటా 20,000 వీసాలు మాత్రమే జారీ చేసేదిఅయితేప్రత్యేక వ్యూహానికి అనుగుణంగా ఈ సంఖ్యను 90,000కు పెంచాలని నిర్ణయించిందిజర్మనీలో పనిచేసే అవకాశం లభించడం ద్వారా మరింత మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందిఇటీవలి సంవత్సరాల్లో గల్ఫ్ దేశాలుసహా జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, మారిషస్, ఇజ్రాయెల్, ‘యుకె’ఇటలీ వంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన 21 దేశాలతో వలస-ఉపాధిపై భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుందిఈ నేపథ్యంలో ఏటా 3,000 మంది భారతీయులకు రెండేళ్ల విద్యాభ్యాసం-ఉపాధి కోసం ‘యుకె’ వీసాలు జారీ చేస్తుందిఅలాగే 3,000 మంది భారత విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువుకునే అవకాశం లభిస్తుందిభారత్ ప్రతిభ దేశాభివృద్ధికి మాత్రమేగాక ప్రపంచ ప్రగతిలోనూ ఇతోధిక పాత్ర పోషించే దిశగా మనం పురోగమిస్తున్నాం.

మిత్రులారా!

   దేశ యువతరంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆకాంక్షలు నెరవేర్చగల ఆధునిక వ్యవస్థకు రూపమివ్వడం నేటి ప్రభుత్వ బాధ్యతఆ మేరకు మీరు ఏ హోదాలో ఉన్నా యువతరానికిపౌరులకు గరిష్ఠ చేయూత సహా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయాలి.

మిత్రులారా!

   మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగం లభించడంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులుపౌరులదే కీలక పాత్రమనకీ హోదాఅవకాశాలు రావడానికి కారణం వారే కాబట్టిమన నియామకాల  లక్ష్యం ఇకపై ప్రజలకు సేవ చేయడమేవ్యయప్రయాసలుపలుకుబడితో నిమిత్తం లేకుండా ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చే ఈ కొత్త సంస్కృతిలో మన బాధ్యత చాలా కీలకంఆ మేరకు  పౌర జీవనంలో సమస్యల పరిష్కారం ద్వారా వారి రుణాన్ని మనం తీర్చుకోవాలిమనం పోస్ట్‌ మ్యాన్ లేదా ప్రొఫెసర్‌ కావచ్చు... హోదాపాత్ర ఏదైనా దేశ ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యంముఖ్యంగా పేదలువెనుకబడిన-అట్టడుగు వర్గాలుగిరిజనులుమహిళలుయువతరం విషయంలో మన బాధ్యతలు నెరవేర్చాలివీరిలో ఎవరికి సేవ చేసే అవకాశం వచ్చినా దాన్నొక అదృష్టంగా భావిస్తూ మనల్ని మనం కర్తవ్య బద్ధులను చేసుకుందాం.

నవ భారత నిర్మాణానికి యావద్దేశం సంకల్పించిన ప్రస్తుత సమయంలో మీరంతా కేంద్ర ప్రభుత్వంలో భాగమవుతున్నారుఈ సంకల్పం సాకారం కావాలంటే ప్రతి రంగంలో మనం రాణించాలిఇందులో మీలాంటి యువ సహోద్యోగుల సహకారం అత్యావశ్యకంఅందుకే చక్కగా పని చేయడం ఒక్కటే కాకుండా విలక్షణ రీతిలో విధి నిర్వహణ మీ లక్ష్యం కావాలిమన ప్రభుత్వోద్యోగుల పనితీరు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శప్రాయంగా మారాలిమనపై దేశ ప్రజలకు ఎన్నో అంచనాలు ఉండటం సహజం... అందునా ఆకాంక్షాత్మక భారత్ స్ఫూర్తి ఫలితంగా మనపై వారి ఆశలు మరింత ఎక్కువగా ఉంటాయిమనపై ప్రజలకుగల నమ్మకాన్ని ప్రతిబింబించే ఈ ఆశలుఆకాంక్షలే దేశ ప్రగతికి సారథ్యం వహిస్తున్నాయికాబట్టిమనం ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేసేలా చూసేది వారిలోని ఈ విశ్వాసమే.

మిత్రులారా!

ఈ నియామకంతో వ్యక్తిగత జీవితంలోనూ మీ కొత్త పయనం మొదలవుతుందిఅయితేమనం పాలకులం కాదు... సేవకులమనే వాస్తవాన్ని గుర్తుంచుకునివినయంతో మెలగాలని మిమ్మల్ని కోరుతున్నానుఈ ప్రయాణంలో నిరంతర అభ్యాసంతో కొత్త నైపుణ్యాలను సముపార్జించండిఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘గాట్’ (iGOT) కర్మయోగి వేదిక ద్వారా వివిధ కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తోందిఈ ఆన్‌లైన్‌ డిజిటల్ శిక్షణ మాడ్యూళ్లు మీకు అందుబాటులో ఉంటాయివీలు చిక్కినప్పుడల్లా మీకు ఆసక్తిగల అంశాలపై ఈ కోర్సులు పూర్తి చేయవచ్చుమీ విజ్ఞాన విస్తరణకు ఈ వనరులను సద్వినియోగం చేసుకోండి.

మిత్రులారా! మీ కృషి ఫలితంగా 2047 నాటికి మన దేశం ‘వికసిత భారత్’గా మారుతుందనే నమ్మకం నాకుందిఇప్పుడు మీరంతా 2022 లేదా 25 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు... భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే సమయానికి మీరంతా మీ ఉద్యోగాల చరమాంకానికి చేరుతారుఅంటే- ‘వికసిత భారత్’ను తీర్చిదిద్దడంలో మీ 25 ఏళ్ల కృషి కూడా దోహదం చేసిందని మీరు సగర్వంగా చాటుకోగలరుఇదెంతో గొప్ప అవకాశం.. గౌరవంఅంటేమీకు ఇవాళ ఒక్క ఉపాధి మాత్రమే కాదు... గొప్ప అవకాశం కూడా లభించిందిఈ అవకాశాన్ని అందిపుచ్చుకునిమీ కలల సాకారానికి దృఢ సంకల్పంతో కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానుఆ మేరకు ‘వికసిత భారత్‌’ సంకల్పం నెరవేరేదాకా మనం విశ్రమించ రాదు.. అంకితభావంతో కూడిన ప్రజాసేవ ద్వారా కర్తవ్యం నిర్వర్తించాలి.

ఈ రోజు నియామక పత్రాలు అందుకున్న మిత్రులందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలుఉజ్వల భవిష్యత్తు దిశగా మీరు అన్నిటా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానుఈ ఆనందాన్ని మీ కుటుంబాలు కూడా పంచుకుంటాయి కాబట్టివారికి కూడా నా శుభాకాంక్షలుదీపావళి పండుగ శోభతోపాటు ఈ కొత్త అవకాశంతో మీకు సంబరాలు రెట్టింపు సంతోషంతో సాగుతాయిమిత్రులారా... ఈ క్షణాన్ని అమితానందంతో ఆస్వాదించండిశుభం భూయాత్!

ధన్యవాదాలు.

 

***




(Release ID: 2069792) Visitor Counter : 3