ప్రధాన మంత్రి కార్యాలయం
రోహిణీ గోడ్‌బోలే మృతికి ప్రధాని సంతాపం
Posted On:
25 OCT 2024 9:16PM by PIB Hyderabad
శ్రీమతి రోహిణి గోడ్‌బోలే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఆమె గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్త అని శ్రీ మోదీ కొనియాడారు. సైన్స్ రంగంలో మరింత మంది మహిళలు అడుగుపెట్టేలా స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారు. విద్యారంగంలో ఆమె చేసిన కృషి భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు.
‘‘రోహిణీ గోడ్‌బోలే మరణం నాకు బాధ కలిగించింది. ఆమె గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్త. సైన్సు రంగంలో మరింత మంది మహిళలు ప్రవేశించేలా ఆమె స్ఫూర్తిగా నిలిచారు. విద్యారంగంలో ఆమె చేసిన కృషి రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆమె కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఎక్స్ లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.
***
MJPS/SR
(Release ID: 2068335)
Visitor Counter : 50
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam