ప్రధాన మంత్రి కార్యాలయం
ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిమవీరులకు ప్రధాని శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
24 OCT 2024 10:41AM by PIB Hyderabad
ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ హిమవీరులు, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పరాక్రమానికి, నిబద్ధతకు ఐటీబీపీ ప్రతీక అని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక సహాయ కార్యక్రమాల్లో వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఇది ప్రజలకు గర్వకారణమని, స్ఫూర్తిదాయకమని నింపుతుందని తెలిపారు.
‘‘ఐటీబీపీ హిమవీరులు వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పరాక్రమానికి, నిబద్ధతకు ఈ దళం ప్రతీకగా నిలుస్తుంది. సవాళ్లతో నిండిన భూభాగాలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ మనల్ని కాపాడుతున్నారు. అదనంగా ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక సహాయ కార్యక్రమాల్లో వారు చేస్తున్న కృషి ప్రజలకు స్ఫూర్తిదాయకం, గర్వకారణం అని శ్రీ మోదీ ‘‘ఎక్స్’’ లో రాశారు.
***
MJPS/VJ/SR
(रिलीज़ आईडी: 2067615)
आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Manipuri
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam