హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా

భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేయడానికి దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది సిద్ధం

జాతీయ పోలీసు స్మారక చిహ్నంలో ప్రధాన కట్టడం మన సైనికుల అచంచలమైన నిబద్ధతకు, ప్రగాఢమైన దేశభక్తికీ, అత్యున్నత త్యాగానికీ వారు సంసిద్ధం

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేం
పోలీసు సిబ్బంది సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యం

పోలీసు సిబ్బందికి ఆరోగ్యం, గృహనిర్మాణం, ఉపకార వేతనాలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను తెచ్చిన మోదీ ప్రభుత్వం

జవాన్ల త్యాగానికి గుర్తుగా ప్రధాని మోదీ నిర్మించిన జాతీయ పోలీసు స్మారక చిహ్నం మన యువతకు స్ఫూర్తి; ఈ రోజు మనం అనుభవిస్తున్న భద్రత, పురోగతి వేలాది మంది సైనికుల అత్యున్నత త్యాగాలకు గుర్తు

భద్రతా దళాల అంకితభావంతో గత పదేళ్ళలో వామపక్ష తీవ్రవాదానికి, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అశాంతికి ముగింపు

డ్రోన్లు, మాదకద్రవ్యాల వ్యాపారం, సైబర్ నేరాలు, కృత్రిమ మేధ ద్వారా అశాంతిని వ్యాప్తి చేసే సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది.

ఎంత తీవ్రమైన బెదిరింపులు, సవాళ్లు వచ్చి

Posted On: 21 OCT 2024 2:52PM by PIB Hyderabad

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారుఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీడైరెక్టర్ తపన్ కుమార్ డేకాకేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకుకచ్ నుంచి కిబిథు వరకు భారత సరిహద్దులను పోలీసు దళాల జవాన్లు రక్షిస్తున్నారని కేంద్ర హోంమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారుపగలయినారాత్రయినా పండుగలు లేదా విపత్తులు ఉన్నాతీవ్రమైన వేడివర్షం లేదా చలిగాలులు ఉన్నావారు ఎల్లప్పుడూ మనల్నిసరిహద్దులను కాపలా కాస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద ఉన్న ప్రధాన కట్టడం విధినిర్వహణ పట్ల మన సైనికుల అచంచలమైన నిబద్ధతకువారి ప్రగాఢమైన దేశభక్తికివారి అత్యున్నత త్యాగ నిరతికీ ప్రతీక అని శ్రీ అమిత్ షా అన్నారు. 1959లో ఇదే రోజున 10 మంది సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్జవాన్లు చైనా సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారుశ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సైనికుల త్యాగానికి గుర్తుగా ఢిల్లీ నగరంలో పోలీసు స్మారక చిహ్నాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు శ్రీ అమిత్ షా గుర్తు చేశారుఈ పోలీసు స్మారక చిహ్నం మన యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందనిఈ రోజు మనం అనుభవిస్తున్న భద్రతపురోగతి వేలాది మంది సైనికుల అత్యున్నత త్యాగం వల్లనేనన్న విషయాన్ని పౌరులకు గుర్తు చేస్తూనే ఉంటుందన్నారుదేశ రక్షణభద్రత కోసం 36,468 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారనిఇది దేశ పురోభివృద్ధికి దోహదపడిందన్నారుగత ఏడాది కాలంలో 216 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారనిఈ అమర వీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆన్నారు.

దేశ భద్రత కోసం మన పోలీసు బలగాలు చేసిన ప్రాణత్యాగం సంప్రదాయంగా మారిందని కేంద్ర హోం మంత్రి అన్నారుహిమాలయాల్లోని మంచుతో నిండిన ప్రమాదకర శిఖరాలు మొదలుకొని కచ్బార్మర్ వంటి కఠినమైన ఎడారులుసువిశాల మహా సముద్రాల వరకు మన సాహస సైనికులు నిర్భయంగా దేశాన్ని కాపాడుతూదాని భద్రతకు భరోసా కల్పించిన చరిత్ర మనకు గర్వకారణమని ఆయన అన్నారు.

జమ్మూకాశ్మీర్వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా శాంతికి విఘాతం కలుగుతోందనిఅయితే గత దశాబ్దకాలంలో మన భద్రతా దళాల అంకితభావంసమర్థత కారణంగా శాంతిని నెలకొల్పడంలో విజయం సాధించామని శ్రీ అమిత్ షా అన్నారుఅయితే మన పోరాటం ఇంకా ముగియలేదని ఆయన అన్నారుడ్రోన్లుమాదకద్రవ్యాల వ్యాపారంసైబర్ క్రైమ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐద్వారా అశాంతిని కలిగించే ప్రయత్నాలుమతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే కుట్రలుచొరబాట్లుఅక్రమ ఆయుధాల స్మగ్లింగ్ఉగ్రవాదం వంటి సవాళ్ళను నేడు మనం ఎదుర్కొంటున్నామని అన్నారుఎన్ని బెదిరింపులుసవాళ్లు ఎదురైనా అవి మన సైనికుల అచంచల సంకల్పం ముందు నిలబడలేవని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.

2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతను  నెరవేర్చడానికి దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది కృతనిశ్చయంతో ఉన్నారని హోం మంత్రి తెలిపారుపార్లమెంటు ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు ఇప్పటికే అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారుఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక న్యాయ వ్యవస్థగా అవతరిస్తుందన్నారుదేశంలో ఏ మూలన ఏ నేరం నమోదైనా సుప్రీంకోర్టు వరకు మూడేళ్ల వ్యవధిలోనే న్యాయం జరుగుతుందని ఆన్నారున్యాయం అందించడంలో జాప్యాన్ని అధిగమించే మార్గం ఈ మూడు కొత్త చట్టాల అమలులోనే ఉందని ఆయన ఉద్ఘాటించారు.

పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని శ్రీ అమిత్ షా అన్నారుఆయుష్మాన్ సీఏపీఎఫ్ పథకం ద్వారా 41 లక్షలకు పైగా కార్డులు పంపిణీ చేశామనిసుమారు రూ.1422 కోట్ల విలువైన 13 లక్షల క్లెయిములను పరిష్కరించామని తెలిపారుమన జవాన్లువారి కుటుంబాలకు ఈ కార్డు ద్వారా ఎక్కడైనా ఆరోగ్య సేవలు లభిస్తాయని చెప్పారుగృహనిర్మాణ పథకంలో కూడా వారికి కేటాయింపు నిష్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2015లో రూ.3100 కోట్ల వ్యయంతో 13,000 ఇళ్లు, 113 బ్యారక్ ల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందనివీటిలో 11,276 ఇళ్లు, 111 బ్యారక్ లు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తయ్యాయని తెలిపారుసిఎపిఎఫ్ ఇ -ఆవాస్ వెబ్ పోర్టల్ ద్వారా ఖాళీగా ఉన్న ఇళ్లను కేటాయించినట్లు తెలిపారుప్రధానమంత్రి స్కాలర్ షిప్ పథకం మన పోలీసు సిబ్బంది పిల్లలకు ఒక భరోసాగా రుజువైందని అన్నారువీటితో పాటు ఎంబీబీఎస్ లో 26 సీట్లుబీడీఎస్ లో సీట్లను సీఏపీఎఫ్ సిబ్బందిపై ఆధారపడిన కుటుంబాలకు కేటాయించారుకేంద్ర ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని ఏకమొత్తంలో పరిహారానికి పెంచడం వల్ల జవాన్ల కుటుంబాలకు ఎంతో ఉపశమనం లభిస్తుంది

శాంతి భద్రతల పరిరక్షణదేశ భద్రతతో పాటు మన పోలీసు సిబ్బందిముఖ్యంగా సిఎపిఎఫ్ సిబ్బంది అనేక ఇతర విధులు కూడా నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అన్నారు. 2019 నుంచి 2024 వరకు సిఎపిఎఫ్ సిబ్బంది సుమారు కోట్ల 80 లక్షల 90 వేల మొక్కలు నాటి వాటిని సొంత బిడ్డలా చూసుకుంటున్నారన్నారుపౌర కేంద్రీకృత కార్యాచరణ కార్యక్రమం (సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్)  ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అన్ని సరిహద్దు జిల్లాల్లోని పౌరులకు చేరవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ అమిత్ షా చెప్పారుదేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగం వృథా కానివ్వబోమని హోంమంత్రి స్పష్టం చేశారుఈ సైనికుల త్యాగాల వల్ల దేశ భద్రతకు భరోసా లభిస్తుందని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని  అన్నారుస్వాతంత్ర్య శతాబ్ది వైపు పురోగమిస్తున్న వేళ ఈ దేశం  జవాన్ల త్యాగాలను ఎల్లప్పుడూ కృతజ్ఞాతాభవంతో స్మరించుకుంటుందని ఆయన అన్నారు.

 




(Release ID: 2066741) Visitor Counter : 27