ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రకటన
Posted On:
20 OCT 2024 1:43PM by PIB Hyderabad
ఈ రోజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు :
“రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాదం హృదయాన్ని కలచివేసింది. అమాయక పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలి. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలా ఆదుకునే పనిలో నిమగ్నమైంది: ప్రధాన మంత్రి”
ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు.
‘ఎక్స్’లో ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందజేస్తామని తెలిపారు”.
***
MJPS/SR/RT
(Release ID: 2066667)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam