ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎమ్ గతిశక్తికి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా భారత్ మండపంలో అనుభూతి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి యాత్రకు జోరును అందించడంలో ‘పిఎమ్ గతిశక్తి’ది ఒక ముఖ్య పాత్ర: ప్రధాన మంత్రి
Posted On:
13 OCT 2024 9:44PM by PIB Hyderabad
‘గతిశక్తి’కి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో భారత్ మండపంలో ‘అనుభూతి కేంద్రాన్ని’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రస్థానానికి గతిని జోడించడంలో ‘పిఎమ్ గతిశక్తి’ ఒక ముఖ్యపాత్రను పోషించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి తన అభిప్రాయాన్ని సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఈ కింది విధంగా వ్యక్తం చేశారు:
‘‘గతిశక్తి మూడు సంవత్సరాలను పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ రోజున నేను భారత్ మండపానికి వెళ్లి, అనుభూతి కేంద్రాన్ని పరిశీలించాను. ఈ కార్యక్రమానికి ఎంతటి పరివర్తన ప్రధాన శక్తి ఉందో అక్కడ నేను గ్రహించ గలిగాను.’’
‘‘మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి దిశలో మన దేశం సాగిస్తున్న ప్రయాణానికి వేగాన్ని జత చేయడంలో పీఎమ్ గతిశక్తి ఒక కీలక పాత్రను పోషించింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయ్యేటట్లు చూడడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగించుకొంటోంది. ఏదైనా సవాలు ఎదురైన పక్షంలో, ఆ సవాలు ప్రభావాన్ని తగ్గించడంలో ఇది తోడ్పడగలుగుతుంది.’’
***
MJPS/TS
(Release ID: 2064594)
Visitor Counter : 91
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam