ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయి మెట్రోలో స్థానికులతో మాట కలిపిన ప్రధానమంత్రి
Posted On:
05 OCT 2024 9:15PM by PIB Hyderabad
ప్రయాణికుడు: నేను కృత్రిమ మేధ(ఎఐ) గురించి పరిశోధనలు చేస్తున్నాను సర్!
ప్రధానమంత్రి: కృత్రిమ మేధ గురించిన పరిశోధనా! చాలా బాగుంది!
ప్రయాణికుడు: ఔషధ రంగంలో కృత్రిమ మేధ ఏ రకంగా వాడితే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందో పరిశీలిస్తున్నాం సర్! అలాగే, ఎఐ ద్వారా దేశానికి అవసరమైన కొత్త మందులని ప్రవేశపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.
ప్రయాణికురాలు: నేను సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను సర్! భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్నది నా కోరిక!
ప్రయాణికురాలు: మీరు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నేను పూర్తిగా వినియోగించుకున్నాను సర్! ‘పీఎం స్వనిధి’ రెండు విడతలనూ ఉపయోగించుకుని లాభపడ్డాను.
ప్రయాణికురాలు: నేను హ్యాండ్ బ్యాగులు తయారు చేసే చిన్న వ్యాపారం చేస్తున్నాను. ‘స్వనిధి’ అందించే ప్రయోజనాలను ఉపయోగించుకుని నా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోగలిగాను.
ప్రధానమంత్రి: మంచి విషయం చెప్పారు!
ప్రధానమంత్రి: షిండే గారు ప్రవేశపెట్టిన పథకం వల్ల మీరు ఏ విధంగా లాభపడ్డారు?
ప్రయాణికురాలు: ‘లడ్కీ బహిన్’ పథకం వల్ల మాకు చాలా ప్రయోజనాలు కలిగాయి సర్!
ప్రధానమంత్రి: మీ సమూహంలోని మహిళలందరూ లబ్ధి పొందారా?
ప్రయాణికురాలు: సర్, మేమంతా ‘బాలాంచల్’ అనే బృంద సభ్యులం. బృందంలోని మహిళలందరూ పత్రాలను నింపి ప్రయోజనాలు అందుకునేట్టు జాగ్రత్తలు తీసుకున్నాం.
ప్రధానమంత్రి: మీ చేతికి నగదు అందిందా?
ప్రయాణికురాలు: ఈ వారమే అందుకున్నాం సర్!
ప్రధానమంత్రి: సంతోషమేనా?
ప్రయాణికురాలు: చాలా సంతోషం సర్!
ప్రధానమంత్రి: మీరు ఎన్నేళ్ళ బట్టి ఈ ఉద్యోగం చేస్తున్నారు?
మెట్రో కార్మికుడు: ఏడేళ్ళ బట్టి ఈ పని చేస్తునాను సర్!
ప్రధానమంత్రి: అయితే, పనిలో మంచి నైపుణ్యం సంపాదించి ఉండాలి మీరు..
మెట్రో కార్మికుడు: మంచి అనుభవమే గడించాం సర్!
ప్రధానమంత్రి: అంటే, మీరు ఎక్కడైనా మెట్రో లైన్లు నిర్మించగలరన్నమాట!
మెట్రో కార్మికుడు: మేం సంపాదించిన అనుభవం వల్ల, ఎక్కడైనా మెట్రో లైన్లను నిర్మించగలం సర్!
ప్రధానమంత్రి: మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారా?
మెట్రో కార్మికుడు: వారు సంతోషంగానే ఉన్నారు సర్!
ప్రధానమంత్రి: మీరు చక్కగా నెరవేరుస్తున్న పని వల్లే కద?!
మెట్రో కార్మికుడు: అవును సర్! మేం సాధించిన విజయం వల్లే వారు సంతోషంగా ఉన్నారు!
ప్రధానమంత్రి: ఏదో ఒకరోజు మీ కుటుంబాన్ని తీసుకుని మెట్రోలో ప్రయాణించండి!
మెట్రో కార్మికుడు: తప్పకుండా సర్!
ప్రధానమంత్రి: మెట్రో నిర్మాణం కోసం మీరు ఎంత కష్టపడ్డారో వారికి తప్పక తెలియచేయండి!
మెట్రో కార్మికుడు: అలాగే సర్!
గమనిక: ప్రధానమంత్రి హిందీ సంభాషణకు ఇది అనువాదం.
***
(Release ID: 2063117)
Visitor Counter : 24