ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 6-10 మధ్య భారత్ లో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జు జరిపిన అధికారిక పర్యటన అనంతర ముఖ్య పరిణామాలు

Posted On: 07 OCT 2024 3:40PM by PIB Hyderabad

క్రమ సంఖ్య

ప్రకటనలు

1.

భారత్-మాల్దీవుల ఒప్పందం: సమగ్ర ఆర్థిక, నౌకావాణిజ్య భద్రత దిశగా భాగస్వామ్యం కోసం వ్యూహరచన

2.

మాల్దీవుల తీరప్రాంత రక్షణదళం నౌక ‘హురవీ’కు ఉచిత మరమ్మత్తు సేవలు అందించనున్న భారత్

 

ప్రారంభం/సేవలు మొదలు/అప్పగింత

1.

మాల్దీవుల్లో  భారతీయ ‘రూ పే’ కార్డు ప్రారంభం

2.

హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్ఐఏ)లో నూతన రన్ వే ప్రారంభం

3.

కొనుగోలుదార్లకు ఎగ్జిమ్ బ్యాంక్ అందించే రుణ సదుపాయం ద్వారా నిర్మించిన 700 సామాజిక గృహ సముదాయాల అప్పగింత

 

అవగాహన ఒప్పందాల కొనసాగింపు/నూతన ఒప్పందాలపై సంతకాలు

మాల్దీవుల ప్రతినిధులు

 

భారతీయ ప్రతినిధులు

1.

కరెన్సీ మార్పిడి ఒప్పందం

మాల్దీవుల ద్రవ్య ప్రాధికార సంస్థ గవర్నర్ అహ్మద్ మునావర్ 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక కార్యకలాపాల విభాగం కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్

2.

మాల్దీవులకు చెందిన ‘నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్’, మన దేశానికి చెందిన ‘రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ’ ల మధ్య అవగాహన ఒప్పందం

భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలోని సరిహద్దుల భద్రత విభాగ   కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్

3.

అవినీతి కట్టడి దిశగా భారత నేర పరిశోధన సంస్థ-సీబీఐ, మాల్దీవుల అవినీతి నిరోధక కమిషన్ల మధ్య అవగాహన ఒప్పందం 

భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలోని సరిహద్దుల భద్రత విభాగ    కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్

4.

మాల్దీవుల న్యాయ అధికారుల శిక్షణ, శాఖలో సామర్థ్య పెంపు దిశగా భారత నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, మాల్దీవుల జ్యుడీషియల్ సర్వీస్ కమిషన్ ల మధ్య అవగాహన ఒప్పందం పునరుద్ధరణ

భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్

మాల్దీవులకు భారత హై కమీషనర్ శ్రీ మును మహావర్

5.

క్రీడలు, యువజన వ్యవహారాల్లో భారత్ మాల్దీవుల మధ్య అవగాహన ఒప్పందం పునరుద్ధరణ

భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్

మాల్దీవులకు భారత హై కమీషనర్ శ్రీ మును మహావర్

 

***


(Release ID: 2063025) Visitor Counter : 55