మంత్రిమండలి
2020-21 నుంచి 2025-26 వరకు ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికుల కోసం ఉత్పాదకత అనుసంధానిత రివార్డు (పీఎల్ఆర్) సవరణ పథకానికి కేబినెట్ ఆమోదం
Posted On:
03 OCT 2024 8:36PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ 2020-21 నుండి 2025-26 వరకు ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికుల కోసం ప్రస్తుతమున్న ఉత్పాదకత అనుసంధానిత రివార్డు (పీఎల్ఆర్) పథకాన్ని సవరించడానికి ఆమోదం తెలిపింది.
ఈ సవరించిన పీఎల్ఆర్ పథకం 2020-21 నుండి 2025-26 ఆర్థిక ఏడాది వరకు అమలులో ఉండనుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రధాన పోర్టులు, డాక్ లేబర్ బోర్డులో పని చేసే దాదాపు 20,704 మందికి ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మొత్తం కాలానికి అంచనా వ్యయం రూ.200 కోట్లు కానుంది.
పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తదనుగుణంగా 2020-21 నుండి 2025-26 సంవత్సరాల వరకు అన్ని ప్రధాన పోర్టు అథారిటీలు/ప్రాధికార సంస్థలు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికుల కోసం ఉత్పాదకత అనుసంధానిత రివార్డు (పిఎల్ఆర్) పథకాన్ని సవరించింది. ఇది ప్రస్తుత దేశవ్యాప్త పనితీరు ఆధారంగా ఇచ్చే వెయిటేజీకి బదులు పోర్టు నిర్దిష్ట పనితీరు ఆధారంగా వెయిటేజీని లెక్కించి ఇస్తారు. వేతన గరిష్ఠ పరిమితి ప్రకారం బోనస్ ను నెలకు రూ.7,000గా తీసుకుని, పీఎల్ ఆర్ ను నిర్ణయిస్తారు. నౌకాశ్రయ పనితీరు ఆధారంగా వెయిటేజీని 50 నుంచి 55 శాతానికీ, తర్వాత 60 శాతానికీ పెంచి పీఎల్ఆర్ ను ప్రతి ఏడాదీ చెల్లించాల్సి ఉంటుంది. 2025-26 నాటికి దేశవ్యాప్త వెయిటేజీ భారం 40 శాతానికి తగ్గనుంది. ఇది దేశవ్యాప్త పోర్టుల పనితీరు, నిర్దిష్ట నౌకాశ్రయ పనితీరుకు.. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సమాన వెయిటేజీ విధానాన్ని ఇది భర్తీ చేస్తుంది. ప్రస్తుతం చేసిన ప్రతిపాదిత సవరణ ప్రధాన పోర్టుల మధ్య పోటీతో పాటు, సామర్థ్య ప్రభావాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు.
ఈ పీఎల్ఆర్ పథకం మెరుగైన ఉత్పాదకతను ప్రేరేపించడంతో పాటు, పోర్టు రంగంలో మెరుగైన పారిశ్రామిక సౌకర్యాలను, అనుకూలమైన పని వాతావరణాన్ని పెంపొందిస్తుంది.
ఉత్పాదకత అనుసంధానిత రివార్డ్ (పీఎల్ఆర్) ప్రధాన పోర్టు ట్రస్టులు, డాక్ లేబర్ బోర్డ్ ఉద్యోగులు, కార్మికుల కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకం. దీనిలో ప్రధాన పోర్ట్ అథారిటీల యాజమాన్యం, లేబర్ ఫెడరేషన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా ఉద్యోగులు, కార్మికులకు వార్షిక ప్రాతిపదికన ఆర్థిక రివార్డును అందిస్తారు.
***
(Release ID: 2061793)
Visitor Counter : 86
Read this release in:
Tamil
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Malayalam