హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణకు వరద సహాయం కింద రూ.416.80 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి(ఎస్డీఆర్‌ఎఫ్) నుంచి కేంద్రం వాటాగా, జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి ముందస్తుగా 14 వరద బాధిత రాష్ట్రాలకు రూ .5858.60 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం




ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆయా రాష్ట్రాలతో భుజం భుజం కలిసి పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం

వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్ రాష్ట్రాల్లో అక్కడికక్కడే నష్టపరిహారం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్(ఐఎంసీటీ)లను పంపించిన ప్రభుత్వం

ఇటీవల వరదల బారిన పడిన బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేసేందుకు త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్న ఐఎంసీటీలు

ఐఎంసీటీల మదింపు నివేదికలు అందిన తరువాత, నిబంధనల్లో పొందుపరిచిన పద్ధతులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు ఆర్థిక సహాయానికి ఆమోదం తెలపనున్న కేంద్ర ప్రభుత్వం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ఈ ఏడాది 21 ర

Posted On: 01 OCT 2024 6:46PM by PIB Hyderabad

రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి కేంద్రం వాటాగా, జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి ముందస్తు సాయంగా- 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు హోం మంత్రిత్వ శాఖ రూ .5858.60 కోట్లు విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్రకు రూ.1492 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.1036 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, మిజోరానికి రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు అందనున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఆయా రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి.

 

 

 

 

ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచంటంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని.. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలోని ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో భుజం భుజం కలిపి పనిచేస్తోంది.

 

 

 

 

వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్ రాష్ట్రాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటీ)లను అక్కడికక్కడే నష్టపరిహారం అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది.

ఇటీవల వరదల బారిన పడిన బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేసేందుకు త్వరలోనే ఐఎంసీటీలను పంపనున్నారు. వీటి మదింపు నివేదికలు వచ్చిన తరువాత, నిబంధనల్లో పొందుపరిచిన పద్ధతులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు ఆర్థిక సహాయానికి ఆమోదం లభించనుంది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ఇప్పటికే ఈ ఏడాదిలో 21 రాష్ట్రాలకు రూ.14,958 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఇందులో 21 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి రూ.9044.80 కోట్లు, 15 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి రూ.4528.66 కోట్లు, 11 రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్డీఎంఎఫ్) నుంచి రూ.1385.45 కోట్లు ఉన్నాయి.

 

ఆర్థిక సహాయంతో పాటు, వరద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక బృందాలు, వైమానిక దళాలను మోహరించడంతో సహా అన్ని రకాల రవాణా సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.

 

***

 


(Release ID: 2060908) Visitor Counter : 99