రాష్ట్రపతి సచివాలయం
సియాచిన్ బేస్ క్యాంప్ ను సందర్శించి, సైనికులతో మాట్లాడిన భారత రాష్ట్రపతి
Posted On:
26 SEP 2024 2:40PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు సియాచిన్ బేస్ క్యాంప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సియాచిన్ హిమపర్వతంపై యుద్ధవీరుల స్మారక స్థూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. 1984, ఏప్రిల్ 13న భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించినప్పటి నుంచి అమరులైన సైనికులు, అధికారుల త్యాగానికి గుర్తుగా ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ఆమె సంభాషించారు.
సైనికులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ... సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా వారి గురించి చాలా గర్వంగా భావిస్తున్నాననీ, వారి ధైర్యసాహసాలకు దేశప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారని అన్నారు.
1984 ఏప్రిల్‌లో ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభమైనప్పటి నుంచి, భారత సాయుధ దళాల వీర సైనికులు, అధికారులు ఈ ప్రాంత రక్షణ కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. వారు తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నా, ఏమాత్రం చలించకుండా తమ విధుల్ని నిర్వహిస్తున్నారన్నారు. భారీ హిమపాతం, మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత వంటి క్లిష్ట పరిస్థితులలోనూ వారు పూర్తి అంకింతభావం, అప్రమత్తతతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మాతృభూమి రక్షణ కోసం వారి త్యాగం, సహనం అసాధారణమైనవని పేర్కొన్నారు. భారతీయులందరికీ సైనికుల త్యాగం, ధైర్యసాహసాలు తెలుసునని, దేశమంతా వారిని గౌరవిస్తున్నదని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 2059278)