మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫేట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్‌బిఎస్) రేట్లను ఆమోదించిన మంత్రివర్గం

Posted On: 18 SEP 2024 3:14PM by PIB Hyderabad

ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకుకోసం ఫాస్ఫాట్పొటాష్ (పి అండ్ కెఎరువులపై పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్రేట్లను ఖరారు చేయాలన్న రసాయనాలుఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఈ  ఏడాది రబీ సీజన్ కోసం అవసరమైన తాత్కాలిక బడ్జెట్ సుమారు రూ.24,475.53 కోట్లు.

ప్రయోజనాలు:

  •   రైతులకు రాయితీపైసరసమైనసహేతుకమైన ధరలకు ఎరువులు అందుబాటులోకి వస్తాయి.

  • అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ఎరువులుపెట్టుబడి ధరల ధోరణుల దృష్ట్యా పి అండ్ కె ఎరువులపై రాయితీని సవరిస్తున్నారు.

అమలు వ్యూహంలక్ష్యాలు:

రైతులకు సరసమైన ధరలకు ఈ ఎరువులు అందుబాటులో ఉంచడానికి ఈ ఏడాది రబీ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు వర్తించేకోసం ఆమోదించిన రేట్ల ఆధారంగా పి&కె ఎరువులపై రాయితీ అందిస్తారు.

నేపథ్యం:

ఎరువుల తయారీదారులు/దిగుమతిదారుల ద్వారా ప్రభుత్వం 28 గ్రేడ్‌ల పి అండ్ కె ఎరువులను రైతులకు రాయితీ ధరలకు అందుబాటులో ఉంచుతోందిపి అండ్ కె ఎరువులపై ఎన్‌బీఎస్ పథకం ద్వారా 01.04.2010 నుంచి రాయితీ అందిస్తున్నారురైతు హితమైన విధానానికి అనుగుణంగారైతులకు సరసమైన ధరలకు పి అండ్ కె ఎరువులు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిఅంతర్జాతీయంగా ఎరువులుత్పాదక పెట్టుబడి అంటే యూరియాడిఏపీఎంవోపీ, సల్ఫర్ ధరల్లో ఇటీవలి ధోరణులకు అనుగుణంగాఫాస్ఫేట్పొటాష్ ఎరువులపై రాబోయే రబీ సీజన్ 01.10.24 నుంచి 31.03.25 వరకు కాలానికి ఎన్‌బీఎస్ రేట్లను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిందిఆమోదించి, నోటిఫై చేసిన ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు రాయితీ అందిస్తారుదీనివల్ల రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి వస్తాయి.

 

***


(Release ID: 2056412) Visitor Counter : 68