హోం మంత్రిత్వ శాఖ
2025 పద్మ పురస్కారాల నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబరు 15
Posted On:
12 SEP 2024 3:30PM by PIB Hyderabad
వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు/సిఫార్సులు మే 1న ప్రారంభమయ్యాయి. పద్మ పురస్కారాలకు నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబరు 15. పద్మ పురస్కారాలకు సంబంధించి నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
పైన పేర్కొన్న పోర్టల్ లో సూచించిన విధానంలో నామినేషన్/ సిఫార్సు చేయాలనుకున్న వ్యక్తి వివరాలతో పాటుగా 800 పదాలకు మించకుండా ఆ వ్యక్తి విశిష్టతను, సంబంధిత రంగం/విభాగంలో సాధించిన విజయాలు/సేవను స్పష్టంగా వివరించాలి.
****
(Release ID: 2054210)
Visitor Counter : 60
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada